అమ్మ రాజీనామానా.. అమ్మతో రాజీనామానా: వైఎస్సార్సీపీ ఎంపీ హాట్ కామెంట్స్!
2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు.. రఘురామకృష్ణరాజు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఆయన అప్పటి నుంచి రెబల్ గా వ్యవహరిస్తున్నారు. వివిధ అంశాల్లో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు కూడా ఆయనపై అంతే స్థాయిలో మండిపడుతున్నారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాళ్లు విసురుతున్నారు. ఇటీవల భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో స్థానిక ఎంపీగా పాల్గొందామని చివరి నిమిషం వరకు రఘురామకృష్ణరాజు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రయత్నాలను ప్రభుత్వం వమ్ము చేసింది.
ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్ పై విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ ప్లీనరీపై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయలక్ష్మి వీడ్కోలు సభలా వైసీపీ ప్లీనరీ సమావేశం ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడంపైనా ఎంపీ రఘురామ సెటైర్లు వేశారు.
అమ్మ రాజీనామానా.. అమ్మతో రాజీనామా అని అందరూ అడుగుతున్నారని అన్నారు. విజయమ్మ రాజీనామా చేస్తోందని తాను ముందే చెప్పానన్నారు. అమ్మ రాజీనామా కరెక్ట్... అమ్మతో రాజీనామా కూడా కరెక్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో అయినా గౌరవాధ్యక్షులకు పెద్దపీట వేస్తారని.. వైసీపీలో మాత్రం పెద్దకుర్చీలో సీఎం... చిన్న కుర్చీలో గౌరవాధ్యక్షులు ఉన్నారని గుర్తు చేశారు. గౌరవ అధ్యక్షురాలికి పెద్ద సీటు వేస్తే గౌరవం ఉండేదని రఘురామ అంటున్నారు.
జగన్ జైల్లో ఉన్నప్పుడు దేహిదేహి అంటూ ఉంటే విజయలక్ష్మి అందరి చుట్టూ తిరిగారని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడుకు బెయిల్ కోసం విజయలక్ష్మి... సోనియా కాళ్లు పట్టుకున్నట్లు సమాచారం కూడా ఉందన్నారు. ప్లీనరీలో జగన్ చెప్పినవేవీ చేయలేదని విజయలక్ష్మికి చెప్తానని రఘురామ తెలిపారు.
పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అనే కాన్సెప్ట్ కుదరదని.. వైఎస్ జగన్ కైనా, ఇంకెవరికైనా ఇదే నిబంధన వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడు కాన్సెప్ట్ భారతదేశంలో ఎక్కడ లేదన్నారు. తాను కూడా పార్టీలో సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలని, ఎన్నికలు లేకపోతే పదవిలో ఐదేళ్లు మాత్రమే ఉండాలని చెప్పారు. పార్టీ శాశ్వత అధ్యక్ష ఎంపికపై తాను కోర్టుకు వెళ్తానని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు.