ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. గత పది రోజులుగా ఏపీలో కరోనా కేసులు ప్రతి రోజు 60 కి తగ్గకుండా వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో 1700 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఇప్పటివరకు ఏపీలో అన్ని జిల్లాలలో కేసు నమోదు అయినా కూడా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. కరోనా రహిత జిల్లాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విజయనగరంలో ఇప్పుడు కరోనా ఛాయలు కనిపించినట్లు తెలుస్తోంది. దీనిపై అటు విజయనగరం జిల్లా అధికారులు గానీ, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు గానీ ఇంకా ఎలాంటి భహిరంగ ప్రకటన చేయలేదు. అయితే ప్రసారమాధ్యమాల్లో జిల్లాలో తోలి కరోనా కేసు నమోదు అయిందని అంటూ ప్రచారం జరుగుతుండటంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.
విజయనగరం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కొద్దిరోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆమెకు డయాలసిస్ చేయిస్తున్నారు. దీనికోసం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తరచూ విశాఖపట్నంలోని ఓ ఆసుప్రతికి వస్తుండేవారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర వైద్య చికిత్స చేయించుకోవాల్సి ఉన్నందున.. ఆమె అధికారులు విశాఖకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. ఈ తరుణంలోనే మూడు రోజుల కిందట ఆమె తన స్వగ్రామం చిలకలపల్లి నుంచి విశాఖపట్నానికి వెళ్లారు. ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకున్నారు. ఆ సమయంలో ఆసుపత్రి నర్సులు ఆమెకు కరోనా వైద్య పరీక్షలను నిర్వహించారు
ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. సదరు మహిళకు కొడుకుల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖ అనుమానిస్తోంది. అందులో భాగంగానే కుటుంబ సభ్యులందరినీ జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్వీ రమణకుమారి చెప్పారు. అయితే ఆ మహిళ కుటుంబ సభ్యులు దాదాపుగా విజయనగరం జిల్లా అంతటా తిరిగినట్టు సమాచారం. ఇప్పటిదాకా కరోనా వైరస్ సోకని జిల్లాగా పేరున్న విజయనగరంలో తొలి కేసు నమోదు కావడం చర్చనీయాంశమౌతోంది. పొరుగు ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశించడానికి దారి తీసే అన్ని మార్గాల్లోనూ అధికారులు కరోనా వైరస్ వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తంగా దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అలాగే జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు.