సుల్తాన్ సినిమా చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భావోద్వేగంతో కదిలిపోయే పరిస్థితి. ఈ సినిమాలో కొన్ని సీన్లకు.. రియల్ బాక్సర్ విజేందర్ సింగ్ కు కొన్ని పోలికలు కనిపిస్తాయి. రింగులో చెలేగిపోయే విజేందర్.. ప్రత్యర్థి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడడు. మాటలతో అవమానించడు. చులకన చేయడు. వినయంగా వ్యవహరిస్తాడు. తన మీద మాటలు పేలే వారి మాటల్ని పట్టించుకోకుండా పొడిపొడిగా మాట్లాడతాడు. ఆవేశంతోరెచ్చిపోడు.
బయట ఇలా ఉంటే విజేందర్.. ఒక్కసారి రింగ్ లోకి దిగితే మాత్రం అతడ్ని ఆపటం ఒక పట్టాన సాధ్యం కాదు. ప్రొపెషనల్ బ్యాక్సింగ్ కెరీర్ ను ఎంచుకున్న విజేందర్ ఇప్పటికి ఏడు మ్యాచుల్లో పాల్గొంటే.. ఏడింటిలోనూ విజయం సాధించాడు. అతడి కెరీర్ లో అతి పెద్ద టైటిల్ అయిన డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ చాంఫియన్ షిప్ ను సొంతం చేసుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్ కు ముందు.. విజేందర్ ప్రత్యర్థి.. ఆస్ట్రేలియా ప్రొబాక్సర్ కెర్రీ హోప్ చాలానే మాటలు పేలాడు. అతడ్ని చిత్తు చేస్తానని.. అతడి గత విజయాల్నిపట్టించుకోనని చెప్పాడు.
బయట ఇన్ని మాటలు చెప్పినప్పటికి.. రింగులో విజేందర్ ధాటికి తట్టుకోలేకపోయాడు. దేశంలో ఇప్పటివరకూ జరిగిన ప్రొ బౌట్ లో అతి పెద్దదైన ఈ పోటీలో ప్రతి రౌండ్ లోనై తన అధిక్యతను ప్రదర్శించిన విజేందర్ పంచ్ పవర్ ను చూసేందుకు పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా రావటం గమనార్హం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు.. క్రికెటర్లు యువరాజ్ సింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు హాజరయ్యారు. బాక్సర్ మేరీ కాం కూడా ఈ పోటీని తిలకించారు. ఎప్పటిలానే రింగ్ లో చెలరేగిపోయిన విజేందర్.. అద్భుత విజయాన్ని సాధించిన అనంతరం మాట్లాడుతూ.. ఈ విజయం తనది కాదని.. భారతదేశానిదని చెప్పారు. ఈ మ్యాచ్ చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పిన అతగాడు.. సుల్తాన్ చిత్రంలో మాదిరి తన ప్రత్యర్థిని మ్యాచ్ అయిన తర్వాత ఎంత మర్యాదగా వ్యవహరిస్తారో విజేందర్ కూడా అంతే మర్యాదగా వ్యవహరిస్తూ.. చాలా బాగా ఫైట్ చేశాడని.. కానీ విజయం తనను వరించిందని వినయంతో చెప్పిన తీరుకు ఈ రియల్ సుల్తాన్ కు హేట్సాప్ చెప్పాల్సిందే.