మరో నాలుగు రోజుల్లో జరగనున్న బాక్సింగ్ పోటీ మీదా క్రీడాభిమానుల ఆసక్తి పెరుగుతోంది. భారత స్టార్ట్ బాక్సర్ విజేందర్ సింగ్.. బల్గేరియా బాక్సర్ సామెటో హ్యుసెనోవ్ లు ఈ నెల 19న తల పడనున్నారు. ఈ సందర్భంగా విజేందర్ సింగ్ ను రెచ్చగొట్టేలా సామెటో మాటల యుద్ధానికి తెర తీశాడు. రింగులో విజేందర్ ఎముకలు విరగొడతానంటూ వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యర్థి రెచ్చగొడితే రెచ్చిపోయే వైఖరిని భిన్నంగా విజేందర్ మాత్రం కూల్ గా వ్యవహరిస్తున్నారు. తాను మాటలు చెప్పే కన్నా.. రింగులో తన ఆటతో సమాదానం చెబుతానని చెబుతున్నాడు. ప్రొఫెషనల్ బౌట్లలోకి మారిన తర్వాత విజేందర్ రెండు పోటీల్లోనూ నాకౌట్ చేశారు. ప్రత్యర్థుల్ని తేలిగ్గా మట్టి కరిపించాడు. ముచ్చటగా మూడోసారి బల్గేరియా బాక్సర్ తో తలపడనున్నాడు. తాజా పోటీ నేపథ్యంలో తన మాటలతో విజేందర్ పై ఒత్తిడి పెంచే పనిని సామెటో షురూ చేశారు.
అయితే.. అతగాడి మాటల్ని పట్టించుకోని విజేందర్ తానేమీ తక్కువ కాదని.. ఒలింపిక్స్ లో పతకం సాధించిన విషయాన్ని మర్చిపోకూడదని.. బెదిరింపులకు బెదిరిపోనని.. చెప్పాల్సిన సమాధానం రింగులోనే చెబుతానంటూ బదులిస్తున్నాడు. మరి.. వీరి మద్య పోటీ కాస్త కిక్కు ఎక్కించటం ఖాయం.