ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 8మంది పోలీసులను పొట్టనపెట్టుకొని తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే హతమయ్యాడు. ఈరోజు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించాడు.
గురువారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో పట్టుబడ్డ వికాస్ ను ఈరోజు ఉదయం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కాన్పూర్ కు తరలించేందుకు బయలు దేరారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో కాన్వాయ్ లోని ఓ వాహనం బోల్తాపడింది. దీన్ని అదునుగా భావించిన వికాస్ ఓ పోలీస్ తుపాకీని లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. లొంగిపోవాలన్నా ఆదేశాలను భేఖాతరు చేశాడు.పైగా పోలీసులపైకి కాల్పులు జరిపాడు.
దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
కారు బోల్తా పడ్డ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడినట్లు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే దూబే అనుచరులు కార్తికేయ, ప్రవీణ్ దూబే ఇప్పటికే గురువారం ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎనిమిది మంది పోలీసులను చంపిన వికాస్ దూబేతో సహా ఆరుగురు కిరాతకులు హతమయ్యారు.