బర్గర్​ కోసం లాంగ్​ జర్నీ.. 725 కి.మీ హెలిక్యాప్టర్​లో వెళ్లిన లవ్​బర్డ్స్​ ..!

Update: 2020-12-05 00:30 GMT
వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే..! బర్గర్​ తినేందుకు ఓ ప్రేమజంట లాంగ్​ జర్నీకి వెళ్లింది. ఎంత లాంగ్​ జర్నీ అంటే 725 కిలోమీటర్లు. అది కూడా హెలీక్యాప్టర్​లో. రోజు సేంద్రియ వంటకాలు తిన్న ఈ జంటకు రొటీన్​ఫుడ్​ బోర్​కొట్టిందట. దీంతో లాంగ్​జర్నీ చేసి బర్గర్లు తిని వచ్చేశారు. రష్యాకు చెందిన విక్టర్ మార్టినోవ్ పెద్ద వ్యాపారవేత్త. చాలా రిచ్​ పర్సన్​ అతడికి ఓ గర్ల్​ఫ్రెండ్​ ఉంది. వీళ్లిద్దరి ఆరోగ్యం కోసం కొన్నేళ్లుగా సేంద్రియ ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే రోజు అవే ఆహారపదార్థాలు తిని బోర్​ కొట్టేసింది.

వాళ్లకు మెక్​డోనాల్డ్స్​ బర్గర్​ తినాలని అనిపించిదట. దగ్గర్లో స్టోర్స్​ లేవు. దీంతో అనుకున్నదే తడువుగా 725 కిలోమీటర్లు ప్రయాణించి క్రిమియాలో ఉన్న మెక్‌డోనాల్ట్స్‌ అవుట్‌లెట్‌కు వెళ్లి అక్కడ బర్గర్లు తిన్నారు. వీళ్ల హోటల్​ బిల్లు 4,800 అయితే.. హెలీకాప్టర్‌కు కోసం మాత్రం రూ. 2 లక్షలు అయ్యిందట. ఈ విషయంపై మార్టినోవ్​ ఏమంటాడంటే.. ‘ రోజూ ఒకే తరహా ఫుడ్​ తిని నాకు బోర్​కొట్టింది. ఏంచేయని చెప్పండి అందుకే హెలికాప్టర్​ బుక్​చేసుకొని బర్గర్​ తినొచ్చా. ఇదేదో సంచలనం కోసం చేయలేదు. నాకు ఆ సమయంలో అలా అనిపించింది అందుకే అలా చేశా’ అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ విషయం సొషల్​మీడియాలో తెగవైరల్​ అయ్యింది. ‘ నువ్వు గ్రేట్​ బ్రో.. బర్గర్​ కోసం 728 కిలోమీటర్లు అది కూడా హెలిక్యాప్టర్​లో వెళ్లావంటే మాటలు కావు. అయినా డబ్బున్నోడు తలుచుకుంటే కానిది ఏముంది.’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Tags:    

Similar News