ఊహించిందే జరిగింది...పల్లె కొంప మునిగింది

Update: 2020-08-04 02:30 GMT
ఎక్కడి నుంచో ఒక మహమ్మారి మనల్ని చుట్టుముట్టింది. మన కడుపు కొట్టింది. భయం వేసినపుడు చిన్న పిల్లలు అమ్మవద్దకు పారిపోయినట్టు, కరోనా విపత్తుతో ఉపాధి కోల్పోయిన జనం కాసింత తలదాచుకోవడానికి అమ్మలాంటి పల్లెటూరుకు తరలివెళ్లారు. లాక్ డౌన్ కారణంగా మొదటి నెలరోజులు నగరాల్లో బలవంతంగా ఉండిపోయినా... కాసింత వెసులు బాటు దొరకంగానే జనం పల్లెబాట పట్టారు.

అయితే, పల్లెకు చేరేలోపే మనకు తెలియకుండా మనలో చేరిపోయింది కరోనా. తొలినాళ్లలో పెద్దగా పల్లెల్లో విస్తరించలేదు. అయితే, ఎంతకీ జీవనం సాధారణ స్థితికి రాకపోవడంతో కొంతకాలం నగరాల్లో వేచిచూసిన వారు కరోనాని ఊరికి తెలియకుండానే తీసుకెళ్లారు. దీంతో దావానలంలా పల్లెలను చుట్టేసింది కరోనా.

విదేశాల నుంచి కొన్ని కేసులు మనదేశానికి వచ్చినా... వాటి ముప్పు ముందే తెలుసుకాబట్టి గవర్నమెంటు గుర్తించి చికిత్స చేసింది. కానీ మర్కజ్ ఒక తెలియని శత్రువులా మీద పడింది. 140 దేశాల నుంచి వచ్చిన మత ప్రతినిధులు మనదేశంలోకి అడ్డదిడ్డంగా చొరబడ్డారు. టూరు వీసా తీసుకుని మత సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన సదస్సుకు వీరు హాజరు కాగా ఇక్కడికి వీరి సందేశాలు వినడానికి దేశ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో జనం హాజరయ్యారు. అలా విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చిన వారు ఈ వేలాది మందికి అంటించారు. వారికి తెలియకుండా వారు కరోనాని దేశ వ్యాప్తంగా మోసుకెళ్లారు. వీరి ద్వారా నగరాల్లో అందరికీ విస్తరించింది. సాధారణ జనంలోకి పాకిపోయింది.

ఇపుడు వారంతా పల్లెబాట పట్టడంతో పల్లెలకు బాగా పాకిపోయింది కరోనా. తెలంగాణ, ఆంధ్రా తేడాలేదు. అన్ని చోట్లా వేలాది గ్రామాలకు ఇది చేరిపోయింది. తెలంగాణ లెక్కలే తీసుకుంటే  ప్రస్తుతం దాదాపు 270 మండలాలు, 1,500 గ్రామాల్లోకి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించిన ఒక నివేదికలో తేలింది. వచ్చేనెలలో దాదాపు ఐదు వేల గ్రామాల్లో వైరస్‌ వ్యాప్తి జరుగుతుందని ప్రభుత్వం అంచనా. ఇది సామాజిక వ్యాప్తి వల్లే జరిగిందని వైద్యవర్గాలు వివరిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రలో వైరస్ లేని మండలం లేదు.

టెస్టులు అయితే సదుపాయాలు కల్పించుకోలిగాం గాని రాబోయే రోజుల్లో పెరగబోయే కేసులకు తగినట్టు ఆస్పత్రి సదుపాయాలు మన వద్ద లేవు. అందుకే ఈ స్థాయిలో కరోనా సోకకుండా ఉండాలంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. నగదుతో సహా ఇంట్లోకి తెచ్చే ఏ వస్తువుకైనా శుభ్రం చేసుకోవడం గాని, లేదా 3 రోజులు వాడకుండా బయటపెట్టడం గాని చేయాలి. శానిటైజ్ చేయకుండా, శుభ్రం చేయకుండా ఏ వస్తువును ఇంట్లోకి తేవద్దు. నిరంతరం వేడిచేసిన నీరే తాగడం, వీలైతే ప్రతి ఒక్కరు సాయంత్రం పూట ఆవిరి పెట్టుకోవడం వల్ల బాగా నియంత్రించే అవకాశం ఉంది. ఒకటి గుర్తు పెట్టుకోండి. కోటీశ్వరులు కూడా చనిపోతున్నారు... మరి వారికి చికిత్స చేసుకునే డబ్బులున్నాయి కదా. సమస్య డబ్బు కాదు... కరోనా ఎవరి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు. ఎందుకొచ్చిన గొడవ.. మన పల్లెను మనం కాపాడుకుందాం.  
Tags:    

Similar News