కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాయి. అటు జనం కూడా.. ఎవరికి వారు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అయితే.. ఓ మహిళ మాత్రం కొత్త సెక్యూరిటీ గురించి తెలిపింది. కరోనాపై పోరాటంలో తనకు మద్యం సహకరిస్తుందని, మద్యం తాగుతూనే కొవిడ్ తో ఫైట్ చేస్తానని వెల్లడించింది.
శరవేగంగా పెరుగుతున్న కొవిడ్ కేసులను అదుపు చేసేందుకు పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఢిల్లీ గవర్నమెంట్ వారం రోజులపాటు మొత్తం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ సోమవారం (19వ తేదీ) నుంచి ఏప్రిల్ 26 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని వెల్లడించింది.
ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే జనాలు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. తమకు అవసరమైన వస్తువులు, సరుకులు వగైరా కొనుగోలు చేసుకున్నారు. మరికొందరు మాత్రం ‘మందు జాగ్రత్త’ తీసుకున్నారు. వారం రోజుల వరకు మద్యం దొరికే ఛాన్స్ లేకపోవడంతో.. ముందస్తుగా వారానికి సరిపడా మందు కొనుగోలు చేశారు.
ఈ క్రమంలో పలువురు మహిళలు కూడా వైన్ షాపుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఓ మహిళను జాతీయ మీడియా పలకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి, మద్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా? అని అడగ్గా.. కరోనాతో ఫైట్ చేయడానికి మద్యం ఎంతగానో సహకరిస్తుందని చెప్పడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.