ఆక్సిజన్ మాస్క్ ధరించి వంట.. అమ్మ మీకు వందనం

Update: 2021-05-22 16:30 GMT
అమ్మ అంటే అంతులేని ప్రేమ. అమ్మంటే నిస్వార్థపు అప్యాయత.. అమ్మంటే దైవం. ఇలా అమ్మకు ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. ఈ సృష్టిలోనే అమ్మ ప్రేమ అంత స్వచ్ఛమైనది లేదంటారు. అయితే కరోనా కల్లోలంలోనూ ఈ అమ్మ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని మరీ వంట చేస్తూ తన కుటుంబానికి వండిపెడుతున్న ఫొటో వైరల్ అయ్యింది. ఈ అమ్మ ప్రేమకు నెటిజన్లు అంతా సెల్యూట్ చేస్తున్నారు.

ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో అందరూ బాధితులుగా మారుతున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ పెట్టుకోవడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక మహిళ ఆక్సిజన్ పెట్టుకోని మరీ వంట చేస్తున్నారు.వంట గదిలో చపాతీ కాలుస్తున్న చిత్రం చూపరులను కలిచివేసింది. ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కొంచెం దూరంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో మహిళ నిలబడి వంట చేస్తోంది. ఈ దృశ్యం చూసి నెటిజన్లు అందరూ ఈ అమ్మ ప్రేమకు సలాం చేస్తున్నారు. ఆమె అనారోగ్యం బారినపడ్డా కూడా వంట చేస్తూ తన కుటుంబానికి అందిస్తున్న తీరుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ ఫొటో ఎవరు తీశారో.. ఎక్కడిదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఫొటో వైరల్ అవుతోంది. తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా పనిచేస్తూ పోవడం చూసి ఫిదా అవుతున్నారు. చాలా మంది ఈ అమ్మ ప్రేమకు ఎమోషనల్ అవుతున్నారు. ఆ మహిళ త్వరగా కోరుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
Tags:    

Similar News