రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డు బద్దలు కొట్టాడు. కొద్ది రోజుల క్రితం ఆసియా కప్ టీ20లో ఆప్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచులో 60 బంతుల్లో 122 పరుగులు చేసి తన 71వ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే.
దాదాపు 1000 రోజుల తర్వాత అంటే మూడేళ్ల తర్వాత విరాట్ సెంచరీ అందుకున్నాడు. తద్వారా టెస్టులు, వన్డేలు, టీ20ల్లో సెంచరీలు చేసిన అతి తక్కువ మంది బ్యాట్సమన్ల సరసన విరాట్ కూడా చేరాడు.
ఆసియా కప్‌లో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేసి అత్యధిక పరుగులు (276) చేసిన బ్యాట్సమన్ గా నిలిచాడు. అంతేకాకుండా టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డులను కోహ్లీ తన పేరున లిఖించుకున్నాడు. కాగా విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో రికార్డు బద్దలుకొట్టాడు. అయితే ఇది క్రికెట్‌లో వచ్చిన రికార్డు కాదు. సోషల్ మీడియాలో వచ్చిన రికార్డు.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ పామ్ అయిన ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీని అనుసరించేవారి సంఖ్య 50 మిలియన్ల (5 కోట్లమంది)కు చేరుకుంది. ఐదు కోట్ల మంది ట్విట్టర్‌లో విరాట్ ను అనుసరిస్తున్నారు. ప్రపంచంలో ఈ రికార్డును అందుకున్న తొలి క్రికెటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.
ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడలు కలిపి చూసుకుంటే పోర్చుగల్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (103.4 మిలియన్లు) 10 కోట్ల మంది ఫాలోవర్లతో ట్విట్టర్‌లో తొలి స్థానంలో ఉన్నాడు. అలాగే బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ నెయ్‌మార్ (57.9 మిలియన్లు) 57.9 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
వీరిద్దరి తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఇకపోతే కోహ్లీకి ఇన్ స్టాగ్రామ్‌లో 211మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అంటే 21 కోట్ల మంది ఫాలోవర్లు అన్నమాట. అలాగే ఫేస్‌బుక్‌లో 49 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.