ఐపీఎల్ చరిత్రలో హయ్యెస్టె పెయిడ్ ఆటగాళ్లు వీరే..

Update: 2018-01-27 07:36 GMT
ఐపీఎల్ పదకొండో సీజన్ వేలంలో కోహ్లీకి రూ. 17 కోట్లు - ధోనీకి 15 కోట్లు - రోహిత్ కు 15 కోట్లు చెల్లిస్తున్నారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర అందుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. కాగా గత పదేళ్లుగా అభిమానుల్ని అలరిస్తున్న ఐపీఎల్‌ లో ఈసారి 578 మంది క్రికెటర్లు వేలంలోకి వస్తుండగా.. భారత్ నుంచే దాదాపు 62 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఇందులో ఉన్నారు.
    
గత పది సీజన్లలో అత్యధిక ధరకు అమ్ముడైన క్రికెటర్లు వీరే..

* 2018: కోహ్లీ - రాయల్ చాలంజర్స్ బెంగళూరు: 17 కోట్లు

* 2015 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ రూ.16 కోట్లతో భారత సీనియర్ ఆల్‌ రౌండర్ యువరాజ్ సింగ్‌ ని దక్కించుకుంది.

* 2017 సీజన్ వేలంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ రూ. 14.5 కోట్లతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌ రౌండర్‌ ని బెన్‌ స్టోక్స్‌ ని కొనుగోలు చేసింది.

* 2014 సీజన్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.14 కోట్లతో యువరాజ్ సింగ్‌ ని చేజిక్కించుకుంది.

* 2014 సీజన్‌ లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ.12.5 కోట్లతో దినేశ్ కార్తీక్‌ ని కొనుగోలు

* 2016 సీజన్‌ లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ రూ. 12.5 కోట్లతో మహేంద్రసింగ్ ధోనీని కొనుగోలు
    
కాగా తాజా 2018 వేలంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ను తీసుకోకపోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. మరోవైపు గత ఏడాది ఐపీఎల్ వేలంలో రూ. 14.50 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్ ఈ ఏడాది అంత ధర పలకలేదు. రూ. 12.5 కోట్లకే ఆయనను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. శిఖర్ ధావన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రూ. 7.6 కోట్లతో దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరలో వేలానికి వచ్చిన అశ్విన్ భారీ మొత్తానికి అమ్ముడుపోవడం విశేషం. కీరన్ పొలార్డ్ ను ముంబై ఇండియన్స్ రూ. 5.4 కోట్లకు సొంత చేసుకుంది.
Tags:    

Similar News