కొహ్లీ భయపడేది ఆ ఒక్కడికే!

Update: 2016-10-20 22:30 GMT
టీమిండియాలో యువ సంచలనం విరాట్ స్థానం ప్రత్యేకం. వరుసపెట్టి సెంచరీలు బాదడం - ప్రత్యర్ధులపై తనదైన స్టైల్లో విరుచుకుపడటం కోహ్లీకున్న ప్రత్యేకతలు. అటు మైదానంలోనూ, ఇటు మైదానం వెలుపలా కూడా విరాట్ ఫుల్ ఫేమస్!! ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే ప్రస్తుతం టీం ఇండియాలో కీలక ఆటగాడిగా, టెస్టు టీం కెప్టెన్ గా దూసుకుపోతున్న విరాట్ కు ఒక్క విషయంలో మాత్రం తెగ భయమంట. అలా అని సచిన్ బ్యాటింగ్ అంటే భయమని షేన్ వార్న్ అన్నట్లు - లక్ష్మణ్ ని అవుట్ చేయడం అంటే తమకు చాలా ఇబ్బందని ఆసిస్ ఆటగాళ్లు అన్నట్లు అలాంటి భయం కాదు సుమా! ఆ మాటకొస్తే... విరాట్ అంటే ప్రత్యర్ధి బౌలర్లు భయపడతారు కానీ... విరాట్ భయపడతాడా? నో వే... కానీ విరాట్ కి నిజంగానే ఒక వ్యక్తి అంటే చాలా భయమట. అయితే అది మరో రకం భయం కాదు... గౌరవంతో కూడిన భయం!

అవును... కోహ్లీకి అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అంటే అంతగా భయమంట. తన జీవితం కథాంశంగా సీనియర్ క్రికెట్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి రచించిన "డ్రైవెన్" పుస్తకావిష్కరణలో పాల్గొన్న సందర్భంగా విరాట్ ఈ ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు. కోచ్‌ అంటే ఉన్న అపార గౌరవం అని, ఆ కారణంగా ఆయన ఎన్ని మాటలన్నా ఇప్పటికీ మౌనమే తన సమాధానమని చెబుతున్నాడు కోహ్లీ. రాజ్ కుమార్ శర్మే తనకు 1998 నుంచి కోచ్‌ గా ఉన్నారని, తానెప్పుడూ కోచ్ ను మార్చే ఆలోచనే చేయలేదని అన్నాడు. ఇదే సమయంలో తప్పుచేస్తే కోచ్ నుంచి చీవాట్లు తినాల్సి వస్తుందని అప్పట్లో తెగ హడలిపోయేవాడినని మరోసారి సభాముఖంగా గుర్తుచేసుకున్నాడు కోహ్లీ.

కాగా, ఈ ఈవెంట్ లో భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్ - అనిల్ కుంబ్లే - రవిశాస్త్రి - వీరేంద్ర సెహ్వాగ్ లు పాల్గొని విరాట్ ఆటతీరును కొనియాడారు. తాను టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న సమయంలో ప్రదీప్ సాంగ్వాన్ తన వద్దకు వచ్చి "భయ్యా ఓ బ్యాట్స్ మన్ నిన్ను కచ్చితంగా అదిగమిస్తాడు.. నీ రికార్డులను బ్రేక్ చేస్తాడు" అని చెప్పాడని అతడే విరాట్ కొహ్లీ అని చిచ్చరపిడుగు సెహ్వాగ్ తెలిపాడు. ఇదే సమయంలో విరాట్ పై ప్రశంసల జల్లులు కురిపించిన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్... ఫిట్ నెస్సే విరాట్ బలమని అభిప్రాయపడ్డాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News