వన్డేల్లో 6 వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ వుమెన్ గా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో, మిథాలీని క్రీడా ప్రపంచం ప్రశంసలతో ముంచెత్తింది. అదే తరహాలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా ఫేస్ బుక్ లో మిథాలీకి అభినందనలు తెలిపాడు. కానీ, ఆ పోస్టులో మిథాలీకి బదులుగా పూనమ్ రౌత్ ఫొటోను పెట్టాడు. దీంతో, విరాట్ పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది.
సచిన్ తో పాటు పలువురు క్రికెట్ సూపర్ స్టార్ల నుంచి మిథాలీకి అభినందనలు వెల్లువెత్తాయి. అయితే, కోహ్లీ మాత్రం మిథాలీకి బదులు పూనమ్ రౌత్ ఫొటో పోస్టు చేసి నవ్వులపాలయ్యాడు. మిథాలీ రికార్డుపై కోహ్లీ స్పందిస్తూ. ‘‘భారత క్రికెట్‌లో ఇది ఒక అద్భుతమైన ఘట్టం. మహిళా క్రికెట్ చరిత్రలో మిథాలీ రాజ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమెన్‌గా నిలిచింది. మిథాలీ ఓ చాంపియన్’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.
పూనమ్ ఫోటోతో మిథాలీకి విషెస్ చెప్పిన కోహ్లీపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆ ఫోటో మిథాలీది కాదనీ... అదే మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన పూనమ్ ది అని గుర్తుచేశారు. మహిళా క్రికెట్‌కు గౌరవం తెచ్చిన మిథాలీ రాజ్ ను కోహ్లీ గుర్తించకపోవడం సిగ్గుచేటని ఫేస్ బుక్ లో ఓ అభిమాని విమర్శించాడు. టీమిండియా కెప్టెన్ ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండడం ఏమిటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు స్పెషల్ మ్యాచ్ గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆమె రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. వుమెన్ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు(5993) ఇప్పటివరకు ఇంగ్లండ్ మహిళా క్రికెట్ దిగ్గజం చార్లోట్ ఎడ్వర్డ్స్ పేరుమీద ఉంది. మిథాలీ 6000 పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్రకెక్కింది.