ప్రపంచకప్ సెమీస్ లో ఓడిపోయాక భారత క్రికెట్ జట్టులో విభేదాలున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. వైస్ కెప్టెన్ రోహిత్, కెప్టెన్ కోహ్లీ గ్రూపులుగా విడిపోయారని వార్తలొచ్చాయి. అయితే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు అదంతా తూచ్ ఒట్టి ప్రచారమని కోహ్లి - కోచ్ రవిశాస్త్రి కొట్టిపారేశారు.
అయితే తాజాగా కెప్టెన్ కోహ్లీ పోస్ట్ చేసిన ఫొటో చర్చనీయాంశమైంది. టిమిండియా కలిసున్న ఫొటోను కోహ్లీ షేర్ చేశాడు. అది వైరల్ గా మారింది. కానీ అందులో రోహిత్ లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘కోహ్లీ.. రోహిత్ ఎక్కడ?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిబట్టే టీమిండియాలో లొసుగులు ఉన్నాయని కొందరు అభిమానులు కామెంట్ చేశారు. కోహ్లీ - రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయనడానికి ఈ ఫొటోనే కారణమని చాలా మంది కుండబద్దలు కొట్టారు.
ఇటీవలే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలను రోహిత్ అన్ ఫాలో చేశాడనే ప్రచారం జరిగింది. విభేదాలతో ఇలానే చేశాడనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా రోహిత్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఘాటు పోస్టు పెట్టాడు. ‘నేను జట్టుకోసం బరిలోకి దిగను.. దేశం కోసం ఆడతాను’ అని పేర్కొనడం దుమారం రేపింది. కోహ్లీ ఆటను పరోక్షంగా విమర్శించేందుకు రోహిత్ ఇలా అన్నాడని నెటిజన్లు కామెంట్ చేశారు. ఇప్పుడు కోహ్లీ కూడా టీమిండియా ఫొటోను షేర్ చేయగా.. అందులో రోహిత్ లేకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది.