నేష‌న‌ల్ ఫ్రెండ్లీ రైల్వే స్టేష‌న్ అవార్డు ఏపీకే..ఏ స్టేష‌నో తెలుసా..

Update: 2019-09-28 08:28 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న ప‌ర్యాట‌క రంగాభివృద్ధికి జాతీయ‌స్థాయిలో గుర్తింపు ల‌భించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం జాతీయ స్ధాయిలో మరోసారి కీర్తి పతాకాన్ని ఎగురవేసింది.  అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డులలో ఏపీ  మూడింటిని కైవసం చేసుకోవటం ద్వారా రాష్ట్ర పర్యాటకం తన సత్తా చాటింది. కొత్త ఢిల్లీలో జరిగిన ప్రత్యేక వేడుకలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక - భాషా సాంస్కృతిక - క్రీడా - యువజనాభ్యుదయ శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ - ఆంద్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి - ఆంధ్రప్రదేశ్ పర్యటక అభివృద్ది సంస్ధ నిర్వహణ సంచాలకులు ప్రవీణ్‌ కుమార్  ఈ అవార్డులు అందుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క రంగంలో  మొత్తం మూడు విభాగాలలో జాతీయ స్ధాయి అవార్డులు దక్కించుకోగా - ఇందులో  ఉత్తమ పర్యటక రాష్ట్రంగా అత్యున్నత స్ధాయి పురస్కారంకు ఎంపికైంది. ఏపీకి ప‌ర్యాట‌క రంగంలో మూడు అవార్డులు ఏపీ  రాష్ట్రానికి రావటం విశేషమని ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక - భాషా సాంస్కృతిక - క్రీడా యువజనాభ్యుదయ శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీ‌నివాస్‌ తెలిపారు.

భ‌విష్య‌త్‌లోనూ ఇదే పరంపరను కొనసాగిస్తామని - పర్యాటక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నామని, ఆ క్రమంలోనే తమ శాఖ ఈ పురస్కారాలను దక్కించుకుందన్నారు. ఆంగ్ల భాషలో అత్యున్నత పర్యాటక ప్రచురణను సైతం ఏపి పర్యాటక రంగమే రూపొందించగలిగిందని ముఖ్య కార్యదర్శి ప్ర‌వీన్ కుమార్  వివరించారు. జాతీయ స్దాయిలో స్నేహ పూర్వక రైల్వే స్టేషన్ అవార్డు విశాఖపట్నం దక్కించుకోవటం సాధారణ విషయం కాదని వివరించారు. 

పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు - అధికారుల సమిష్టి కృషి ఫలితంగానే ఈ అవార్డులు దక్కించుకోగలిగామని - ఇది త‌మ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఏపీ ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగంకు ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా రాబోవు రోజుల్లో మరింత ప‌ర్యాట‌కాభివృద్ధికి పాటుప‌డే అవ‌కాశాలున్నాయి.
Tags:    

Similar News