ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేయటం తెలిసిందే. ఏపీలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయటం ద్వారా వ్యూహాత్మకం గా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి. రాజధాని నగరంలో పేరుతో డెవలప్ మెంట్ మొత్తం ఒకేచోట పోగుపడకుండా చేయటం కోసం తాజా నిర్ణయం లాభిస్తుందన్న మాట వినిపిస్తోంది.
మూడు రాజధానుల్లో అమరావతి.. కర్నూలును పక్కన పెడితే.. విశాఖపట్నం అనూహ్యంగా డెవలప్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పక తప్పదు. అమరావతి.. కర్నూలుతో పోలిస్తే.. రాజధాని లక్షణాలు విశాఖలోనే కనిపిస్తాయి. ఇప్పటికే ఆ నగరం కాస్మో కల్చర్ అంతో ఇంతో ఉంది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివసించే వెసులుబాటు ఉండటం.. మౌలికసదుపాయాలు కూడా ఉండటంతోపాటు.. ఆర్థిక రాజధానిగా పర్ ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పాలి.
కొన్ని ఐటీ కంపెనీలు.. పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల తో పాటు.. ఎయిర్ పోర్టు.. స్టీల్ ఫ్యాక్టరీ తో పాటు పలు పేరెన్నిగన్న కాలేజీ లు విశాఖ లో ఉన్నాయి. మిగిలిన రెండు రాజధానులు ఉన్నప్పటికీ అవి నామమాత్రంగా మారి.. డెవలప్ మెంట్ మొత్తం విశాఖ కేంద్రంగా సాగే వీలుంది. మొత్తంగా చూసినప్పుడు రాబోయే రోజుల్లో ఏపీ రాజధాని అన్నంతనే విశాఖపట్నం అన్న పేరే తొలుత వచ్చే వీలుంది. ఏపీలో మూడు రాజధానులు ఉన్నా.. క్యాపిటల్ సిటీ ఇమేజ్ మాత్రం విశాఖకే వస్తుందని చెప్పక తప్పదు.