విశాఖ-విజ‌య‌వాడ‌-గుంటూరు.. ఎవ‌రి ఖాతాలోకి...!

Update: 2023-01-14 03:49 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ ఇత‌ర పార్టీల మ‌ధ్య తీవ్ర యుద్ధం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ముఖ్యంగా మూడు పార్ల‌మెంటు స్థానాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. విజ‌య‌వాడ‌,విశాఖ‌, గుంటూరు స్థానాల‌ను ఎవ‌రు ద‌క్కించుకుంటార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఎందుకు కీల‌కంగా మారాయనేది కూడా ఆస‌క్తిగా మారింది.

విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరులో టీడీపీ గెలిస్తే.. వైసీపీ వ్యూహానికి అనుగుణంగా రాజ‌ధానిని వ్య‌తిరేకించే అవ‌కాశం ఉంటుంది. విశాఖ‌ను రాజ‌ధానిగా చేయాల‌నే వైసీపీ వ్యూహానికి ఇప్ప‌టి వ‌ర‌కు అడ్డుకుంటున్నా.. విశాఖ‌లో ఎంపీగా టీడీపీ లేదా.. అను కూల పార్టీ నాయ‌కుడు లేక‌పోవ‌డంతో టీడీపీ ఇబ్బందులు ప‌డుతోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నికల్లో విశాఖ‌ను ద‌క్కించుకుంటే.. వైసీపీ వ్యూహాల‌కు చెక్ పెట్ట‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

విజ‌య‌వాడ‌, గుంటూరును ద‌క్కించుకుంటే.. గుంటూరు రాజ‌ధానిగా ముఖ్యంగా అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే లెక్క‌లు  వేసుకుంటున్నారు. మ‌రోవైపు.. వైసీపీ కూడా.. ఈ మూడు పార్ల‌మెంటు స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటే..త మ‌కు రాజ‌ధాన‌నిని సాధించేందుకు,  మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని త‌ల‌పోస్తోంది.

ఇక‌, ఇప్పుడు విజ‌య‌వాడ‌, గుంటూరు రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా.. టీడీపీ ప‌రిధిలోనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి, విశాఖ రాజ‌ధానుల విష‌యంలో వైసీపీకి ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయ‌నే చ‌ర్చ ఆ పార్టీలో క‌నిపిస్తోంద‌. అందుకే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను పెట్ట‌డం ద్వారా.. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ద‌క్కించుకుని.. మూడు రాజ‌ధానుల‌ను సాకారం చేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News