ఎలాగైనా ప్రైవేటీకరించేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోటంలో బాగంగా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ లాభాల పంట పండిస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాల్సిందే అని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. నష్టాల్లో ఉన్న సంస్ధలను కేంద్రం అమ్మేస్తోందంటే అర్థముంది. కానీ లాభాల్లో ఉన్న సంస్ధను లేదా లాభాలు తెస్తుందని అనుకుంటున్న సంస్ధలను కూడా అమ్మేయాలన్న నిర్ణయం ఎందుకో కేంద్రమే చెప్పాలి.
ప్రైవేటీకరణ పాలసీలో భాగంగా వైజాగ్ స్టీల్ ను అమ్మేయాలని కేంద్రం చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయాన్ని ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎంతగా ప్రతిఘటిస్తున్నా కేంద్రం ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ఉక్కశాఖ 2021-22 వార్షిక నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం గత ఏడాది ఏప్రిల్ -డిసెంబర్ మధ్యలో మంచి లాభాలను సంపాదించింది. పన్నుకు ముందు రు. 946 కోట్లు, పన్ను తర్వాత రు. 790 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
పోయిన సంవత్సరంలో వచ్చిన రు. 1839 కోట్లను అధిగమించి తాజాగా లాభాలను సంపాదించింది. దీంతో గడచిన ఐదేళ్ళల్లో రెండు సంవత్సరాలు లాభాలు సంపాదించినట్లయ్యింది. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీ సొంతంగా గనులు లేని కారణంగానే ఖర్చులు పెరిగిపోయి నష్టాలు వస్తున్నాయి. చాలా ఫ్యాక్టరీలకు సొంతంగా గనులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ కు మాత్రం మొదటి నుంచి సొంత గనులు ఎందుకు కేటాయించటంలేదో అర్ధం కావడం లేదు.
ఇపుడు కూడా ఉత్పత్తి, అమ్మకాలు, కంట్రిబ్యూషన్ మార్జిన్లో మంచి పనితీరు చూపించింది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ముడి ఉక్కు ఉత్పత్తిలో 47 శాతం, ఫినిష్ట్ స్టీల్ ఉత్పత్తిలో 75 శాతం వృద్ధి సాధించింది.
పోయిన సంవత్సరం నాటికే రు. 19,401 కోట్ల అమ్మకాలు జరిపేసింది. అంటే సొంతంగా గనులు లేని కారణంగా ఇనుప ఖనిజాన్ని బయట మార్కెట్లో ఎక్కువ ధరలకు కొంటోంది. అందుకనే ఎక్కువ ఖర్చులైపోతున్నాయి. అదే సొంతానికి గనులుంటే తొందరలోనే పూర్తిస్ధాయి లాభాల పంటను పండిస్తుందనటంలో సందేహంలేదు.