వ‌దిలేది లేదంటున్న విశాల్..

Update: 2017-12-06 12:47 GMT
ఆర్కే నగర్ ఉప ఎన్నికపై అనూహ్య‌ హైడ్రామా నెలకొన్న సంగ‌తి తెలిసిందే. ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన ప్రముఖ నటుడు - తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు - నడిగర సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ కు ఎదురు దెబ్బ మీద ఎదురుదెబ్బ‌ తగిలింది. ఆయన నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. విశాల్ తో పాటూ జయలలిత మేనకోడలు దీప జయకుమార్ నామినేషన్ ను కూడా ఎన్నికల సంఘం తిరస్కరించింది.  అయితే తన నామినేషన్‌ తిరస్కరణకు గురైందన్న వార్తలతో.. విశాల్ ఆందోళనకు దిగారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో ఆయన నామినేషన్ మళ్లీ ఆమోదించినట్లు వార్తలొచ్చాయి.

అనంత‌రం `సత్యం గెలిచింది - ఎన్నికల అధికారి నా నామినేషన్ ను ఆమోదించారు` అంటూ విశాల్ ట్వీట్ చేశారు. కానీ చివరకు రాత్రి 11.30 గంటల సమయంలో విశాల్‌ నామినేషన్‌ ను కూడా తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. నామినేషన్ పత్రాల్లో ఇద్దరు స్థానికుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో విశాల్ నామినేషన్ తిరసరిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. అయితే ఈ ప‌రిణామాల‌పై విశాల్ మండిప‌డ్డారు. నామినేషన్ తిరస్కరణ తీరు స‌రికాద‌న్నారు. తన నామినేషన్ పత్రాలు తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విశాల్ ఆరోపించారు. మంగళవారం తన నామినేషన్ పత్రాలను తిరస్కరించడంతో ప్రజాస్యామ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని విశాల్ ఆరోపించారు. నామినేషన్ తిరస్కరించిన సంద‌ర్భంపై విశాల్ తీవ్రస్థాయిలో రాత్రి ట్వీట్ చేశారు. `డిసెంబర్ 5 - 2016న అమ్మ (జయలలిత) చనిపోయింది. డిసెంబర్ 5 - 2017న ప్రజాస్వామ్యం చనిపోయింది` అంటూ విరుచుకుప‌డుతూ ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ - ప్రధాని నరేంద్ర మోడి తమిళనాడులోని ఆర్కే నగర్ లో ఏం జరుగుతోందో గమనిస్తూనే ఉంటారని విశాల్ పేర్కొన్నాడు. న్యాయాన్ని పునరుద్ధరించండి అంటూ ఇవాళ మధ్యాహ్నం ట్వీట్ చేశారు. తన నామినేషన్‌ ను పత్రాలు మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా పరిశీలించి తిరస్కరించారని విశాల్ ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. తన పట్ల ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరును చూసి షాక్‌ తిన్నాన‌ని - ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నాని విశాల్ అన్నారు. ఈ సంద‌ర్భంగా కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ త‌న‌పై ప‌క్ష‌పాతం చూపింద‌న్నారు. ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు తిరస్కరించారని విశాల్ ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందని, తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల కమిషన్ తిరస్కరించిందని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశానని విశాల్ చెప్పారు. తన నామినేషన్‌ పత్రాలు బలపరుస్తూ సంతకాలు చేసిన స్థానికులను తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వం బెదిరించిందని విశాల్‌ ఆరోపించారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మనించి త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌న లేఖ‌లో ప్ర‌ధానికి వివ‌రించినట్లు విశాల్ స్ప‌ష్టం చేశారు. అవ‌స‌ర‌మైతే ఈ విష‌యంలో కోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ విష‌యంలో త‌తాను పోరాటం చేస్తాన‌ని ఎంత‌టి వారున్నా..వ‌దిలిపెట్టేది లేద‌ని విశాల్ తేల్చిచెప్పారు.
Tags:    

Similar News