ఉప ఎన్నిక బ‌రిలో విశాల్?

Update: 2018-09-28 19:22 GMT
ఓ ప‌క్క త‌మిళ‌నాట హీరోగా వెలుగొందుతూ మ‌రో ప‌క్క న‌డిగ‌ర్ సంఘం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా తెలుగ‌బ్బాయి విశాల్....రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే.   ఇటు సినిమాల‌తో పాటు అటు రాజ‌కీయాల్లోనూ రాణించాల‌ని విశాల్ కొంత‌కాలంగా గ‌ట్టి ప్ర‌యత్నాలు చేస్తున్న విష‌యం విదిత‌మే. గత ఏడాది ఆర్కే న‌గ‌ర్ నుంచి పోటీ చేయాల‌నుకున్న విశాల్ నామినేష‌న్ ను నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య‌ తిర‌స్క‌రించిన ఘ‌ట‌న అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. దీంతో - కొద్ది రోజుల క్రితం త‌న 40 పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విశాల్ `మ‌క్క‌ల్ న‌ల ఇయ‌క్క‌మ్`పార్టీని స్థాపించాడు. త‌న ఫ్యాన్ క్ల‌బ్ `మ‌క్క‌ల్ న‌ల ఇయ‌క్క‌మ్` ను రాజ‌కీయ పార్టీగా మార్చాడు. ఈ క్ర‌మంలోనే విశాల్ తాజాగా త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న తిరుప్ప‌రంకుద్రం నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక బ‌రిలో దిగ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకు విశాల్ స‌న్నాహాలు చేస్తున్నార‌ని, ఆయ‌న ఫ్యాన్స్ స‌పోర్ట్ చేస్తున్నార‌ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

త‌మిళ‌నాడులో సినీ తారలు రాజ‌కీయ నాయకులుగా మార‌డం....చ‌క్రం తిప్ప‌డం కొత్తేం కాదు. ఎంజీఆర్, జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి,...తాజాగా క‌మ‌ల్ - ర‌జ‌నీ...వీరంతా సినీ ఇండ‌స్ట్రీ నుంచి వ‌చ్చిన‌వారే. ఇదే కోవ‌లో విశాల్ కూడా త‌న రాజ‌కీయ తెరంగేట్రానికి రంగం సిద్ధంచేసుకుంటున్నార‌ట‌. త‌మిళ‌నాడులోని తిరుప్ప‌రంకుద్రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఏకే బోస్ మృతి చెంద‌డంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో, ఆ స్థానం నుంచి విశాల్ బ‌రిలోదిగాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆ దిశ‌గా కొన్ని సేవా కార్య‌క్ర‌మాల‌ను విశాల్ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ సారైనా విశాల్ బాలారిష్టాల‌ను దాటి అసెంబ్లీలో అడుగుపెడ‌తారా లేదా అన్న ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధాన‌మివ్వాలి. ఈ సారైనా విశాల్ క‌ల తీరుతుందో లేదో తెలుసుకోవాలంటే మ‌రి కొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News