జ‌గ‌న్ గ్రేట్‌ నెస్ ఏంత‌టితో రాజు చెప్పేశారుగా!

Update: 2017-04-06 09:41 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గొప్ప‌త‌నం ఏ పాటితో తెలుగు నేల రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తున్న ఎవ‌రికైనా ఇట్టే అర్థం కాక మాన‌దు. కాంగ్రెస్‌ లో కొన‌సాగినంత‌కాలం జ‌గ‌న్‌పై సింగిల్ కేసు కూడా న‌మోదు కాకున్నా... ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయ‌న సొంత కుంప‌టి పెట్టుకున్న మ‌రుక్ష‌ణ‌మే... కాంగ్రెస్‌, టీడీపీ జ‌ట్టు క‌ట్టి మ‌రీ ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసును న‌మోదు చేయించాయి. ఈ వ్వ‌వ‌హారంపై దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చే జరిగింది. అయితే కేసుల‌కు ఏమాత్రం జ‌డ‌వ‌ని జ‌గ‌న్‌... ధైర్యంతో వేస్తున్న ముందడుగు చూసి అటు కాంగ్రెస్ పార్టే కాకుండా ఇటు టీడీపీ గుండెల్లో రైళ్లు ప‌రుగులెడుతున్న తీరు కూడా మ‌న‌కు స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది.

జ‌నంలో త‌న బ‌ల‌మేంటో చూపించుకునేందుకు నాడు త‌న వెంట వ‌చ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించిన జ‌గ‌న్‌... ఆయా స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌డం, తెలుగు నేల రెండుగా విభ‌జ‌న కావ‌డం జ‌రిగిపోయాయి. మ‌రి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జ‌రుగుతున్న తీరు ప్ర‌తి ఒక్క ఓట‌రును కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు మ‌రో పార్టీలోకి చేరే ముందు త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కే కాకుండా... త‌మ‌ను చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపిన పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వాల‌కు రాజీనామాలు చేయాలి. వారు చేయ‌క‌పోతే... వారిని చేర్చుకున్న పార్టీలే వారితో ఆ ప‌ని చేయించాలి. ఇది నిఖార్సైన రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నం.

అయితే ఇప్పుడు తెలంగాణ‌లో టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌ లోకి - ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి లెక్కలేనంత మంది ఎమ్మెల్యేలు జంప్ చేశారు. వారిలో కొంద‌రు ఇరు రాష్ట్రాల కేబినెట్ల‌లో మంత్రులుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు కూడా స్వీక‌రించారు. మొన్న‌టి ఏపీ కేబినెట్ పుప‌న‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌లో వైసీపీ నుంచి వ‌చ్చిన 21 మంది ఎమ్మెల్యేల్లో న‌లుగురిని చంద్ర‌బాబు త‌న కేబినెట్‌ లోకి చేర్చుకున్నారు. దీనిపై టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ బీజేపీకి చెందిన‌ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాబుతో పాటు కేసీఆర్ కూడా ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని అప‌హాస్యం చేస్తున్నార‌ని ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ అంశం ఏపీలో పెద్ద చిచ్చే రేపింది. ఈ క్ర‌మంలో నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత‌గా ఉన్న విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు... ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

పురందేశ్వ‌రి వ్యాఖ్య‌లు ఆమె వ్య‌క్తిగ‌తమంటూనే... వ్య‌క్తిగ‌తంగా తాను కూడా ఆమె వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌విస్తాన‌ని చెప్పారు. అంతేకాకుండా... ఈ సంద‌ర్భంగా రాజు చేసిన వ్యాఖ్య చంద్ర‌బాబుకు బాణంలా త‌గల‌డ‌మే కాకుండా... విప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ గొప్ప‌త‌నం ఏ పాటిదో చెప్ప‌క‌నే చెప్పింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తానే గ‌నుక ఏపీ సీఎం హోదాలో ఉండి ఉంటే... ఇత‌ర పార్టీల్లో నుంచి వ‌చ్చిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో రాజీనామాలు చేయించి, వారి రాజీనామాల‌తో ఖాళీ అయిన స్థానాల‌ను ఉప ఎన్నిక‌లు జ‌రిపించి, తిరిగి ఆ స్థానాల నుంచి వారినే గెలిపించుకునేవాడిన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాజు చెప్పిన ఈ విష‌యం చాలా గొప్ప‌ద‌ని ఏ ఒక్క‌రైనా ఒప్పుకోవాల్సిందే. మ‌రి నాడు జ‌గ‌న్ చేసింది ఇదే క‌దా. మ‌రి రాజు గారి మాటల్లోని ఈ అంతరార్థం చంద్ర‌బాబు అండ్ కోకు ఎప్పుడు అర్థ‌మ‌వుతుందో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News