ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ బీజేపీపై ఒత్తిడి చేస్తున్న తరుణంలో బీజేపీ నేతలు కూడా టీడీపీపై ప్రెజర్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో నేతలంతా ఒక్కసారిగా యాక్టివేట్ కావడంతో పాటు నోటికి కూడా పనిచెబుతున్నారు. చంద్రబాబుతో దోస్తీ మెంటైన్ చేసే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా తాజాగా ఫైరయ్యారు. చంద్రబాబును హిట్లర్ తో పోల్చారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి మాట్లాడిన ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
విజయవాడలో ప్రభుత్వం కూల్చివేసిన ఆలయాలను - గోశాలను బీజేపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. దేవాలయాలను కూల్చిన ప్రదేశంలో టాయిలెట్లు నిర్మిస్తుండడం చూసి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్థాన్ లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో పాలన హిట్లర్ పాలనలాగా ఉందన్నారు. కూల్చివేసిన దేవాలయాలను వెంటనే నిర్మించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దొంగల్లాగా అర్థరాత్రి వచ్చి విగ్రహాలను కూల్చడం ఏమిటిని ప్రశ్నించారు.
కాగా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఆందోళనలు మొదలుపెట్టడంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఆలస్యంగా ఈ అంశాన్ని అందుకుని చంద్రబాబును డిఫెన్సులోకి నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ కారణంగానే నిత్యం చంద్రబాబుపై విరుచుకుపడే నేతలు కాకుండా చంద్రబాబుతో సఖ్యత ఉన్న నేతలే విమర్శలకు దిగేలా ప్రణాళికలు వేశారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మామూలుగా అయితే సోమువీర్రాజు - పురంధేశ్వరి - కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతుంటారు. కానీ.. ఈసారి విష్ణుకుమార్ రాజు - ఆకుల సత్యానారాయణలు ఆ బాధ్యతను తీసుకున్నారు. అంతేకాదు.. చంద్రబాబును హిట్లరుతో పోల్చుతూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.