టైం బాగోలేకపోతే టెంకాయ సైతం టైంబాంబ్ మాదిరే పేలుతుందన్న మాటకు తగ్గట్లు ఉంది ఏపీ విపక్ష నేత చంద్రబాబు పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఆయన్ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత తనకున్న 23 మంది ఎమ్మెల్యేలను చూసుకున్న ప్రతిసారీ తాను చేసిన పాపం గుర్తుకు వచ్చే పరిస్థితి.
బాబు పరిస్థితి ఇలా ఉంటే.. ఆపార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి మరోలా ఉంది. ఇటీవల కాలంలో జగన్ అండ్ కో మాటలు వింటున్న పలువురు ఎమ్మెల్యేలు బాబు పార్టీ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదన్నట్లుగా భావిస్తున్నారట. ఇందుకు తగ్గట్లే.. బాబ్బాబు.. పదవి వద్దు.. ఏమీ వద్దు మీ జట్టులో చేర్చుకోండన్న బ్రతిమిలాడటం ఎక్కువైందట.
ఇదే విషయాన్ని చాలా మర్యాదగా చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ ప్రారంభంలోనే తమ పార్టీలోకి వచ్చేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్దంగా ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్య టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో అర్థమయ్యేలా చేసింది. జగన్ మాటలతో బాబు ఆత్మరక్షణలో పడటమే కాదు.. ఉన్న గుప్పెడు మంది ఎమ్మెల్యేల్ని ఎలా కాపాడుకోవాలన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు టీడీపీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎవరిని చేర్చుకోవాలి.. ఎవరిని చేర్చుకోకూడదన్న దానిపై కసరత్తు జరుగుతోందని..త్వరలోనే టీడీపీ భూస్థాపితం కావటం ఖాయమంటూ పెద్ద బాంబే పేల్చారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా మరో విషయాన్ని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు తమతో టచ్ లో ఉన్నారని.. తాము ఓకే అనాలే కానీ పరుగులు పెడుతూ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పిన విష్ణువర్దన్ రెడ్డి బాబు ఉలిక్కిపడే మాటలను చెప్పారని చెప్పాలి. పాపం.. ఈ వయసులో బాబుకు ఇన్ని ఉలిక్కిపాట్లు అవసరమా? చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అనరుగా!