పక్కలో బల్లెంలా మారిన పాక్ విషయంలో భారత్ మరోమారు తన క్లారిటీ ఇచ్చేసింది. టెర్రరిజం వదిలేవరకు పాకిస్థాన్‌ను వదలేది లేదని త్రివిధ దళాలు తేల్చిచెప్పాయి. త్రివిధ దళాలు ఆర్మీ - నావీ - ఎయిర్ ఫోర్స్ ఢిల్లీలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. ఈసందర్భంగా పాక్ ఎఫ్-16 విమానం కూల్చివేత పై సైన్యం ఆధారాలు బయటపెట్టింది. పాక్‌కు చెందిన ఎఫ్-16 శకలాలను త్రివిధ దళాల ఉన్నతాధికారులు మీడియాకు చూపించారు. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 విమానం నుంచి పేల్చిన అమ్రామ్ మిస్సైల్ శకలాలను వాళ్లు మీడియాకు చూపించారు. భారత్ లో పౌరుల రక్షణ, భద్రతకు తాము అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామనీ.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేవరకు ఆదేశంతో తమ పోరాటం కొనసాగుతుందని… ఉగ్రవాద శక్తులపై తమ యుద్ధం ఆగదని ఆర్మీ - నేవీ - ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు.
ఇండియాతో శాంతిని కోరుకుంటున్నామంటూ కలరింగ్ ఇస్తున్న పాకిస్థాన్ పన్నాగాలను త్రివిధ దళాల అధికారులు ఢిల్లీలో వివరించారు. శాంతి శాంతి అంటూనే భారత సైన్యం పైకి మిసైల్స్ ప్రయోగిస్తోందని చెప్పారు. భారత్ తో చర్చలకు సిద్ధమంటూ.. శాంతి సంకేతంగా అభినందన్ వర్దమాన్ ను ఇండియాకు పంపిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని చెప్పడంతో… దానికి కౌంటర్ ఇచ్చారు అధికారులు. శాంతిని కోరుకుంటున్న పాకిస్థాన్ ఫిబ్రవరి 26న భారత ఆర్మీ - సైనిక శిబిరంపై దాడి చేయడానికి ప్రయత్నించిందని చెప్పారు. ఫిబ్రవరి 26 - 27వ తేదీల్లో భారత మిలటరీ బలగాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ … తమ ఎఫ్ 16 ఎయిర్ మిసైల్ ను ప్రయోగించిందని చెప్పారు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్. భారత భూభాగంలోని తూర్పు రాజౌరీలో ఎఫ్ 16 శకలాలు పడ్డాయని చెప్పారు. పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ తో… ఎఫ్ 16 ఎయిర్ మిసైల్ ను ప్రయోగించిందని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. సైనికులను టార్గెట్ చేసిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని ను… భారత ఎయిర్ ఫోర్స్ మిగ్ 21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కూల్చేసిందని చెప్పారు ఆర్జీకే కపూర్. పాకిస్థాన్ జెట్ ఫైటర్ బాంబులు విడిచిందని.. ఐతే.. ఎటువంటి నష్టం కలగలేదని వివరించారు. పాకిస్థాన్ తాము ఎటువంటి వైమానిక దాడి చేయలేదని చెబుతోందని.. ఇది అబద్దమని చెప్పారు.
ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని త్రివిద దళాధిపతులు స్పష్టం చేశారు. `మన సైనిక స్థావరాలనే పాక్ లక్ష్యంగా చేసుకుందనడంలో సందేహం లేదు. పాక్ కవ్వింపు చర్యలను దిగితే తిప్పికొడతాం. భారత గగనతలంలోకి పాక్ విమానాలు ప్రవేశించినట్లు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ గుర్తించింది. భారత వాయుసేనకు చెందిన మిగ్-21 ఆచూకీ లభించలేదు. తొలుత 2 యుద్ధ విమానాలను కూల్చివేశామని పాక్ చెప్పింది. ఇద్దరు పైలట్లు తమ అదుపులో ఉన్నారని మొదట పాక్ ప్రకటించింది. నిన్న సాయంత్రానికి ఒక్క పైలటే తమ అదుపులో ఉన్నారని వాస్తవం ఒప్పుకుంది. జనజీవనం లేని ప్రాంతాల్లోనే బాంబులు వేశామని పాక్ అబద్ధం చెప్పింది. అభినందన్‌ను అప్పగించడం జెనీవా ఒప్పందంలో భాగమే. వైమానిక దాడులపై పాకిస్థాన్ పలుమార్లు మాట మార్చింది` అని త్రివిధ దళాల ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు.