చికెన్‌ షాపు వ్యక్తికి కరోనా పాజిటివ్‌..విశాఖలో హైటెన్షన్‌

Update: 2020-04-07 14:10 GMT
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ ల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో నేడు ఉదయం వరకు 304 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో చికెన్‌ షాపును నిర్వహించే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని వెళ్లడయ్యింది. దిల్లీ మర్కజ్‌ మత సమావేశాలకు వెళ్లి వచ్చిన వ్యక్తి నుండి ఇతడికి కరోనా సోకినట్లుగా పోలీసులు గుర్తించారు. చికెన్‌ షాపు వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో పోలీసులు టెన్షన్‌ పడుతున్నారు.

ఈయన గత కొంత కాలంగా చికెన్‌ షాపును నిర్వహిస్తున్నాడు. తాజాగా కూడా అతడు చికెన్‌ ను విక్రయించాడు. దాంతో అతడి వద్ద చికెన్‌ ను తీసుకు వెళ్లిన వివరాలను తెలుసుకునేందుకు విశాఖ జిల్లా అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 14 మందిని గుర్తించినట్లుగా అధికారులు వెళ్లడి చేశారు. అతడి వద్ద చికెన్‌ తీసుకు వెళ్లిన వారికి ఎంత మందికి కరోనా పాజిటివ్‌ అయ్యి ఉంటుందో ఆ సంఖ్య ఏ మేరకు దారి తీస్తుందో అనే ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతుంది.

మర్కజ్‌ మత సమావేశాలకు వెళ్లి వచ్చిన వారందరికి ట్రేస్‌ చేసి వారితో కాంటాక్ట్‌ అయిన వారిని పట్టుకునేందుకు తీవ్రంగా అధికారులు ప్రయత్నించినా కూడా ఇలాకొందరు అధికారుల నుండి బయట పడ్డారు. దాంతో వీరి నుండి మరికొందరికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మర్కజ్‌ కు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన వారిని క్వారెంటైన్‌ లోకి వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించినా కూడా అతడు చికెన్‌ షాప్‌ నిర్వహించడంతో గాజువాకలో హై టెన్షన్‌ వాతావరణం ఏర్పడినది.
Tags:    

Similar News