విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. దాన్ని కార్మికులు గట్టిగానే అడ్డుకుంటున్నారు. అదే టైమ్ లో విశాఖ ఉక్కులో ఒక్కో కీలక విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి యత్నిస్తున్నారు. బొగ్గు సరఫరా కూడా అందడంలేదు. ఇలా అనేక చికాకులు ఉక్కుకు కలుగుతున్నాయి. దాంతో కార్మికులు రెట్టించిన పౌరుషంతో ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తున్నారు.
ఈ క్రమంలో కార్మికుల ఆగ్రహం కేంద్రంతో పాటు ఏపీ సర్కార్ మీద కూడా పడుతోంది. రాష్ట్రానికి బంగారం లాంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తూంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు అని ఏపీ సర్కార్ నే ఉద్యమకారులు నిలదీస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ ఉక్కుకు సరఫరా అవుతున్న బొగ్గుని కేంద్రం అడ్డుకుంటోందని ఉద్యమ కారులు మండిపడుతున్నారు. ఝార్ఖండ్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న బొగ్గు గనిని ఏకపక్షంగా రద్దు చేసిందని, అలాగే బ్లాస్ట్ ఫర్నేస్ నంబర్ మూడు గత ఆరు నెలల నుంచి మూసేశారని పేర్కొంటున్నారు. పోనీ అని సర్దుకుని దూరాభారం అయినా వేరే చోట నుంచి బొగ్గుని తెచ్చుకుందామంటే మహానంది కోల్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్ నుండి సరఫరా అయ్యే బాయిలర్ కోల్‌ను ప్లాంట్‌కు సరఫరా కానివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే బాయిలర్ బొగ్గు సరఫరాకి రైల్వే వ్యాగన్స్ ఇవ్వకుండా నానా రకాలైన ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. ఈ మొత్తం తతంగం చూస్తూంటే విశాఖ ఉక్కుని తాము ప్రైవేట్ చేయదలచుకున్నాం కాబట్టి ఆ దిశగా తమ ప్రయత్నాలను వారు చేసుకుంటూ పోవడమే అని కేంద్రం ఈ చర్యలు చేస్తోందని ఉద్యమకారులు అంటున్నారు.
దీంతో విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం రాష్ట్రప్రభుత్వమే ముందుకు రావాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను ఆ దిశగా ప్రకటించాలని కూడా వారు కోరుతున్నారు. ఈ నెల 15న విశాఖ వస్తున్న జగన్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని, తాము ఉక్కు సమస్యలను ముఖ్యమంత్రికి పూర్తిగా వివరిస్తామని చెబుతున్నారు.
ఇన్నాళ్ళూ తాము ఉద్యమించామని, ఇక మీదట ఉక్కు ఉద్మయాన్ని ముఖ్యామంత్రే ముందుకు నడిపించాలని వారు కోరుతున్నారు. విశాఖ వస్తున్న సీఎం అక్కడే ఉక్కు విషయంలో ప్రభుత్వ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వివిధ రాజకీయ పక్షాలతో చర్చించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా విశాఖ ఉక్కు పోరాటాన్ని మార్చి కేంద్రం దిగి వచ్చేలా చేయాలని కోరుతున్నారు.
మొత్తానికి ఇది బిగ్ టాస్క్. మోడీ తో కేంద్రంతో ఢీ కొట్టే యుద్ధం, ఇన్నాళ్ళూ ఎలా ఉన్నా ఇపుడు సీన్ మారుతోంది. ఉద్యమకారులు కూడా అసలు ఊరుకునేలా లేరు. దాంతో ఈ నెల 15న విశాఖలో అడుగుపెడుతున్న జగన్ కి ఉక్కు సెగ గట్టిగానే తగలడం ఖాయమని అంటున్నారు.