చిన్నమ్మ మళ్లీ చిక్కుల్లో పడింది. అరచేతిలో అధికారం ఉన్నా.. అందుకు భిన్నంగా జైల్లో చిప్పకూడు తినాల్సి దుస్థితి. చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్న ఆమెలో పరివర్తన అన్నది సరి కదా.. తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడున్న పరిస్థితుల్నే తాను మార్చేస్తానని మరోసారి నిరూపించారు.
అక్రమాస్తుల కేసులో జైలుశిక్షకు గురైన చిన్నమ్మను బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు తరలించటం తెలిసిందే. జైలుకెళ్లిన చిన్నమ్మకు ప్రత్యేకంగా జైలు గది.. టీవీ.. ఇలాంటి చిన్న చిన్న కోరికలకు సైతం జైలు అధికారులు ససేమిరా అనటం వరకూ మీడియాలో అప్డేట్ అయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులకే పరప్పన అగ్రహార జైలు చిన్నమ్మ రాజ్యంగా మారిపోయిందట. దీనికి సంబంధించిన సంచలన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి.
పేరుకు మాత్రమే చిన్నమ్మ జైల్లో ఉన్నారే తప్పించి.. ఆమె హవా ఎంతలా నడుస్తుందన్న విషయం తాజాగా కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప రాసిన లేఖతో బయటకు వచ్చింది. జైళ్ల శాఖ డీజీపీకి రాసిన లేఖలో చిన్నమ్మ హవా ఎంతలా నడుస్తుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆమె పేర్కొందని చెబుతున్నారు.
మొత్తం ఆరు పేజీలున్న ఈ లేఖలో చిన్నమ్మకు జైల్లో ఏర్పాటు చేసిన వసతులు.. నిబంధనల్ని తుంగలోకి తొక్కేసిన వైనాన్ని ఆమె వివరంగా పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. జైలు కాస్తా చిన్నమ్మ రాజ్యంగా మారిందనటానికి నిలువెత్తు ఉదాహరణగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. చిన్నమ్మ శశికళ కోసం.. ఆమెకు అవసరమైన ఆహారాన్ని వండి వార్చటానికి వీలుగా ఏకంగా ఒక కిచెన్ ను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. ప్రత్యేక కిచెన్ ను ఏర్పాటు చేసిన వైనాన్ని డీఐజీ రూప తన లేఖలో పేర్కొన్నట్లుగా తెలిసింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పరప్పన జైల్లో చిన్నమ్మకు మాత్రమే కాదట.. జైల్లోని మిగిలిన ఖైదీలకు కూడా వారికి కావాల్సిన అన్ని వసతులు లభిస్తున్నాయట. జైల్లో ఉన్న చిన్నమ్మకు అవసరమైన వసతులన్నీ కల్పించేందుకు వీలుగా జైల్లోని ఉన్నతాధికారికి దాదాపు రూ.2 కోట్ల మేర లభించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే పరప్పన జైలు కాస్తా.. కోరుకున్న వసతులు కల్పించే స్టార్ జైలు మాదిరి కనిపించట్లేదు?