ఓటుకు నోటు వ్యవహారంలో మరో అడుగు ముందుకు పడింది. ఈ కేసులో నిందితులైన టీటీడీపీ నేతలు రేవంత్..సండ్రలకు చెందిన వీడియో టేపుల్ని కోర్టుకు పంపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో వీడియో టేపుతో అడ్డంగా బుక్ అయిన రేవంత్ తో పాటు.. ఇదే కేసుకు సంబంధించి.. అధికారపక్ష ఎమ్మెల్యేలతో బేరాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యే సండ్రకు సంబంధించిన ఫోన్ కాల్స్ ను ఏసీబీ సేకరించిన విషయం తెలిసిందే.
రేవంత్ వీడియో.. సండ్రకు సంబంధించిన ఆడియోల్లో ఉన్న స్వరం.. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే వారి టేపుల్లోని స్వరం ఒకటేనా? అన్న విషయాన్ని పరీక్షించేందుకు వీలుగా.. వీరి టేపుల్ని ఇవ్వాల్సిందిగా అసెంబ్లీని కోర్టు కోరింది.
ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన వీడియో టేపుల్ని తెలంగాణ అసెంబ్లీ అధికారులు కోర్టుకు పంపారు. తాజా పరిణామాల నేపథ్యంలో రేవంత్.. సండ్రలకు సంబంధించిన అసెంబ్లీ రికార్డులలో ఉన్న వీడియో టేపుల్లోని స్వరాన్ని.. ఓటుకు నోటు కేసులో లభ్యమైన ఆధారాలతో పోలుస్తారు. రెండింటిలోనూ ఉన్నది ఒకే స్వరమన్నది సాంకేతికంగా నిరూపితమైతే.. ఈ కేసుకు సంబంధించిన ఉచ్చు మరింత బిగుసుకునే వీలుంది.