భారత మార్కెట్లో వోల్వో ఎలక్ట్రిక్ కార్.. ప్రీ-బుకింగ్ అప్పట్నుంచే!

Update: 2021-03-10 10:30 GMT
ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం ఎల‌క్ట్రిక్ కార్ల వైపు చూస్తోంది. ప్ర‌ధానంగా వాయుకాలుష్యం నివార‌ణ కోసం దీన్ని స‌జెస్ట్ చేస్తున్నారు. మ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. దీని నివార‌ణ‌కు రోజు విడిచి రోజు కార్లు రోడ్డెక్కాల‌ని నిబంధ‌న‌లు కూడా రూపొందించింది స‌ర్కారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను బ‌య‌ట‌ప‌డేందుకు ఎల‌క్ట్రిక్ కార్లు మంచి ఆప్ష‌న్ గా క‌నిపిస్తున్నాయి.

దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. వాయు కాలుష్యం నుంచి బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం నేప‌థ్యంలో ప్ర‌ముఖ కార్ల త‌యారీ కంపెనీల‌న్నీ ఈ మోడల్స్ ను ఉత్ప‌త్తి చేస్తున్నాయి. తాజాగా ప్ర‌ముఖ వాహ‌న త‌యారీ సంస్థ వోల్వో.. త‌న ఎల‌క్ట్రిక్ కారును భార‌త్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మైంది.

గ‌తేడాది విడుద‌ల చేసిన XC40 రీఛార్జ్‌ SUVని ఇండియ‌న్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది ‌వోల్వో. పూర్తి బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో న‌డిచే ఈ కారు.. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న ల‌గ్జ‌రీ కారుల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. అంతేకాదు.. ప్ర‌స్తుతం బ్యాట‌రీ ఆధారంగా న‌డిచే విలాస‌వంత‌మైన ఎల‌క్ట్రిక్ కార్ల‌లో ఇది స‌రికొత్త మోడ‌ల్ అని చెబుతోంది.

జూన్ నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి కంపెనీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. డెలివ‌రీ అక్టోబ‌రులో మొద‌లువుతుంద‌ని తెలిపాయి. ఈ కారును ఒక‌సారి రీఛార్జ్ చేస్తే 418 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించొచ్చు. అంతేకాదు.. ఈ కార్ పికప్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. కేవ‌లం 4 సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే 100 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు ప్రారంభ ధ‌ర రూ.39.90 ల‌క్ష‌లుగా ఉంది.
Tags:    

Similar News