రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలతో చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి శశాంక్ గోయల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చించారు.అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు.
నవంబర్ 1, 2021న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం.. తెలంగాణలో 3,08,75,744 మంది ఓటర్లు ఉన్నారు.ఈ జాబితాలో పురుషులు 1,52,57,690 మంది, మహిళలు 1,50,97,292 మంది , థర్డ్ జెండర్ 1683 మంది, సర్వీస్ ఓటర్లు 14,501 మంది, ఎన్నారై ఓటర్లు 2742 మంది, పీడబ్ల్యూడీ ఓటర్లు 5,01836 మంది ఉన్నారు.
ఇక ఏపీలో బద్వేలు నియోజకవర్గాన్ని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2021 నవంబర్ 1 తేదీ నాటికి రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 4,04,23,407 గా నమోదైంది. పురుషులు 1,99,53,184, స్త్రీలు 2,04,66,182 మందిగా నమోదయ్యాయి. 4041 థర్డ్ జెండర్లు, 67090 మంది సర్వీసు ఓటర్లుగా నమోదయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,678 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం గుర్తించింది.
ఏపీలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 43,31,945 మంది ఓటర్లు ఉండగా.. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18,94,362 మంది ఓటర్లుగా నమోదు అయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
తెలంగాణ ఓటు హక్కులేని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీనికోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈనెల 6,7,27,28 తేదీల్లో ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించినున్నట్టు ఈసీ వెల్లడించింది. సోమవారం నుంచి ఈనెల 30 వరకు ఓటర్ల అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. జనవరి 5, 2022న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొంది. ఈ జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను డిసెంబర్6 వరకు స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.