అమ‌రావ‌తికి ప్ర‌ముఖులు ఎలా వ‌చ్చారంటే..?

Update: 2015-10-22 06:03 GMT
అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి అతిర‌థ మ‌హార‌థులు విచ్చేశారు. అత్యంత శ‌క్తివంత‌మైన ప్ర‌ముఖులు ఒకేచోట చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎవ‌రికి వారు త‌మ‌దైన ప్ర‌త్యేక‌త‌తో వేదిక వ‌ద్ద‌కు రావటం క‌నిపించింది. ఇక‌.. వేర్వేరు స‌మ‌యాల్లో.. వేర్వేరుగా వ‌చ్చిన ప్ర‌ముఖుల్ని వివిధ ర‌కాల వాహ‌నాల్లో స‌భా ప్రాంగ‌ణానికి తీసుకొచ్చారు.

=  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌భా ప్రాంగ‌ణానికి త‌న తెల్ల‌రంగు కార్ల కాన్వాయ్ లో చేరుకున్నారు.

=  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో పాటు.. ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ.. మంత్రులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి.. ఈటెల రాజేంద‌ర్ వ‌చ్చారు.

=  ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు మొత్తం మూడు బ‌స్సుల్లో గ‌న్న‌వ‌రం ఎయిర్‌ పోర్ట్ నుంచి బ‌య‌లుదేరి స‌భాస్థ‌లి వ‌ద్ద‌కు చేరుకున్నారు.

=  న‌ల్ల క‌ళ్లాద్దాలు.. భుజానికి బ్యాగ్ తో బాల‌య్య‌బాబు కొత్త గెట‌ప్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

=  రామోజీ సంస్థ‌ల అధినేత రామోజీ రావు త‌న‌దైన వైట్ అండ్ వైట్ లో వ‌చ్చారు.

=  ఆయ‌న‌కు టీడీపీ నేత‌లు సాద‌రంగా ఆహ్వానించి వెంట పెట్టుకొని తీసుకెళ్లారు.

=  రామోజీ కుమారుడు ఈనాడు ఎండీ కిర‌ణ్‌.. వేరుగా స‌భాస్థ‌లికి చేరుకున్నారు.

=  గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్‌ కి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ చేరుకున్నారు. మోడీకి స్వాగ‌తం ప‌లికేందుకు ప్రోటోకాల్ లో భాగంగా ఉండిపోయారు.

=  గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ కి చంద్ర‌బాబు చేరుకున్నారు. ప్ర‌ధాని మోడీకి స్వాగ‌తం ప‌లికేందుకు ఆయ‌న వెయిట్ చేస్తున్నారు.

=   శంకుస్థాప‌న కార్య‌క్రమంలో చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ సెంట‌ర్ ఆఫ్ ద అట్రాక్ష‌న్ గా నిలిచారు.

=   ఆయ‌న‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్ర‌ముఖులు సైతం పోటీ ప‌డ‌టం గ‌మ‌నార్హం.

=  లోకేశ్ వెంట సీఎం ర‌మేష్‌.. ఢిల్లీలో టీడీపీ ప్ర‌తినిధి కంభంపాటి రామ్మోహ‌న్‌రావుతోపాటు ప‌లువురు ఉన్నారు.

=  లోకేశ్ షేక్ హ్యాండ్ కోసం టీవీ9 సీఈవో ర‌విప్ర‌కాశ్.. ఎన్ టీవీ అధినేత‌లు వెయిట్ చేయ‌టం క‌నిపించింది.

Buy Bricks Online and Contribute to Amaravathi : http://amaravati.gov.in/EBRICKS/Index.aspx
Tags:    

Similar News