కల్వకుంట్ల కవితకు ఎదురుచూపులేనా?

Update: 2020-03-11 11:10 GMT
సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు పదవీయోగం ఎప్పుడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ అధినేత కుమార్తెకు ఎన్నాళ్లీ ఎదురుచూపులని ఆమె అభిమానులు కలత చెందుతున్నారు.

ప్రస్తుతం మరోసారి కేకేను రాజ్యసభ కు కేసీఆర్ ఎంపిక చేశారని టీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందింది. అదే విధంగా కవితను కూడా ఎంపిక చేస్తారని అంటున్నారు. తాజాగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాస్ రెడ్డి పేరు రాజ్యసభ రేసులో గులాబీ పార్టీ నుంచి వినిపిస్తోంది. ఇదే జరిగితే కవితకు ఈసారి రాజ్యసభ టికెట్ లేదా అన్న అనుమానం ఆమె అభిమానుల్లో మొదలైంది.

ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకుండా పొంగులేటిని కేసీఆర్ పక్కన పెట్టారు. అయినా పార్టీ మారకుండా పార్టీ కోసం కష్టపడుతున్నాడు. అతడికి పునరావాసమైన పదవి ఇస్తానని న్యాయం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారట.. దీంతో కవితకు నిరాశ తప్పదన్న చర్చ సాగుతోంది.

ఇప్పటికే కొడుకు కేటిఆర్, మేనల్లుడు హరీష్ రావు, మరో మేనల్లుడు సంతోష్ కు కేసీఆర్ పెద్ద పదవులు కట్టబెట్టారు. మరో దగ్గరి బంధువు వినోద్‌ను ప్లానింగ్ బోర్డు చీఫ్‌ గా చేశారు. కవిత మాత్రమే అధికారానికి దూరంగా ఉన్నారు.

ఏదేమైనా, కేసీఆర్ ఇతర ముఖ్య నాయకులకు రాజకీయ ఆశ్రయం కల్పించవలసి ఉన్నందున కవితను ఈసారి దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తత్ఫలితంగా, కవిత ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
Tags:    

Similar News