ఆమె ఓ బాధితురాలు, ఆ సమాజం, చట్టం, ప్రభుత్వం నిస్సహాయంగా ఉండి పోయినందుకు ఆమె బాధితురలయ్యారు. తన ఇద్దరు కూతుర్లను కొందరు దుర్మార్గులు అత్యంత పాశవికంగా రేప్ చేసి.. చంపేసినా నిందితులకు శిక్ష పడలేదు. న్యాయం కోసం సదరు మహిళ కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ ఘటన జరిగింది. మేము ఎంతో అభ్యుదయ వాదులం అని చెప్పుకుని రాష్ట్రాన్ని ఏలుతున్న కేరళ లో. ఇదిలా ఉంటే ఇప్పుడీ మహిళ ఓ వినూత్న పోరాటానికి శ్రీకారం చుట్టుంది. ప్రస్తుతం కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమె ఏకంగా సీఎం పినరయి విజయన్ మీద స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు.
ఆమె ఏమంటున్నారంటే.. ’ అధికారం వెలగబెట్టాలని, పెత్తనం చెలాయించాలని, పదవుల కోసం నేను ఇక్కడ పోటీచేయడం లేదు. నా సమస్య ఈ దేశం దృష్టికి తీసుకురావడానికే నేను పోటీచేస్తున్నాను. ఇద్దరు కూతుర్లు అఘాయిత్యానికి గురైతే కనీసం పట్టించుకోని .. ఈ సమాజం, ప్రభుత్వం తీరుకు నిరసనగా నేను పోటీచేస్తున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
కేరళకు చెందిన వలయార్ సిస్టర్స్ దారుణమైన అత్యాచారకాండ జరిగింది. 2017లో జనవరి 13న ఓ బాలికను కిరాతకులు రేప్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చి 4న సదరు బాలిక చెల్లెలు (9)ను దుర్మార్గులు రేప్ చేసి చంపేశారు. వీళ్లిద్దరిని దూలాలకు ఉరివేసి చంపేశారు. ఈ వరస ఘటనలు అప్పట్లో సంచలనమయ్యాయి. ఈ ఇద్దరు కూతుర్లు తల్లి ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నది. కానీ ఏనాడు ఏ ఒక్కరు ఆమెకు మద్దతు గా నిలవలేదు. అడపదడగా కొంత మంది మాత్రమే ఆమె పై జాలి చూపారు. ఇప్పుడు కూడా ఆమె సీఎం మీద పోటీ చేస్తుంటే ఆమెను నిరుత్సాహ పరిచారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదం నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గం నుంచి ఆ రేప్ బాధితుల తల్లి పోటీచేస్తున్నారు. (కొన్నినిబంధనల కారణంగా ఆమె పేరు ఇవ్వడం లేదు) సదరు మహిళ స్వస్థలం పాలక్కాడ్ జిల్లా వాయలూర్ ఆమె కూతుర్లిద్దరిపై 2017 లో లైంగిక దాడి జరిగింది. నాలుగేళ్లు గా ఆమె న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఆమెకు న్యాయం చేస్తానని సీఎం పినరయి విజయన్ కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. అందుకే నేరుగా ఆయనమీదే పోటీచేసి సమజానికి తన సమస్యను వినిపించాలని ఆమె తాపత్రయపడుతున్నది.