బీజేపీలో నాన్ గుజరాతీ పీఎం కావాలని కోరుతున్నారా?

Update: 2021-05-13 15:33 GMT
దేశంలోనే అత్యున్నత పీఠం ప్రధాని పదవి. ఆ పదవిలో గుజరాతీ అయిన మోడీ కూర్చున్నాడు. దేశ అత్యున్నత పదవుల్లో రెండోది కేంద్ర హోంశాఖ పదవి. అందులోనూ గుజరాతీయే.. దీనిపై మొదట్లో ఎవ్వరూ ఏం మాట్లాడకపోయినా.. రానురాను బీజేపీ తప్పిదాలు.. మోడీ షాల ఏకపక్ష నిర్ణయాలతో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. అత్యున్న పదవులు గుజరాతీలకేనా? వేరే ఎవ్వరూ దేశంలో లేరా? అన్న విమర్శలు వస్తున్నాయి.

మోడీ రిటైర్ అయితే  ఆ స్థానంలో అమిత్ షా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈనేపథ్యంలో బీజేపీలో యువనేతలను ఎదగనివ్వడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. నిజానికి మోదీ, అమిత్ షాలు నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన తర్వాతే దేశ వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగురవేయగలిగింది. ఇందులో మరో సందేహానికి తావులేదు. వరస ఎన్నికల్లో గెలుపులు వారి ఇమేజ్ ను మరింత పెంచాయనే చెప్పాలి.

అయితే 2024లో మరోసారి ప్రధాని పీఠమెక్కి రికార్డు సృష్టించాలని మోడీ తపన పడుతున్నారు. అందుకోసమే బీజేపీలో ఉన్న యువనాయకత్వాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దేవేంద్ర ఫడ్నవిస్, యోగి ఆదిత్యానాధ్ వంటి యువనేతలతో పాటు నితిన్ గడ్కరీ వంటి సీనియర్ నేతలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే తమకు నమ్మకమైన వ్యక్తిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించారంటారు.

ఇక బీజేపీలో మోడీషాలు రాకముందు కొంత కాలం వరకూ ఆర్ఎస్ఎస్ ప్రభావం పనిచేసేది. అయితే ఇప్పుడు మోదీ, షాలు ఆర్ఎస్ఎస్ ను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు. అందుకే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ లాంటి వారు తిరిగి అటువైపే వెళుతున్నారు. సంఘ్ పరివార్ ను కూడా అయోధ్య లాంటి అంశాలతో తమ గుప్పిట పట్టేశారంటున్నారు. తమకు పార్టీ పరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇప్పటి నుంచే అన్ని రకాలుగా పావులు కదుపుతున్నారు.  మొత్తం మీద జనం ఆదరిస్తే మరో పదేళ్లపాటు కుర్చీనుంచి దిగేందుకు మోదీ ఇష్టపడటం లేదన్న టాక్ బాగా విన్పిస్తుంది.

 అయితే ఈసారి గడ్డు పరిస్థితులు ఎదురుకావడంతో బీజేపీలోనే మోడీపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. నాన్ గుజారాతీయే ప్రధాని కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. 
Tags:    

Similar News