రష్యాతో యుద్ధం: మృతదేహాలను కుక్కల కోసం వదిలేస్తున్నారు!

Update: 2022-03-12 09:37 GMT
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎన్నో విషాధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యాకు కూడా భారీగానే నష్టం వాటిల్లుతోంది. యుద్ధం తగ్గుముఖం పడుతున్నట్లు మాత్రం కనిపించడం లేదు. ఇరుదేశఆల మధ్య ఇప్పటికే పలు మార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ ఈ చర్చలు మాత్రం విఫలం అవుతూనే ఉన్నాయి. దీంతో రోజురోజుకు యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది తప్ప యుద్ధం ఇప్పట్లో ఆగేలా మాత్రం కనిపించడం లేదు.

ఇక రష్యా కూడా ఎడతెరిపి లేకుండా ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడుతూనే ఉంది. ఇలాంటి సమయంలోనే ఇక తక్కువ సైన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ అటు ఉక్రెయిన్ కూడా రష్యా సేనలతో వీరోచితంగా పోరాటం చేస్తూ వెనక్కి తగ్గడం లేదు.

రష్యా సేనల భీకరమైన దాడుల నేపథ్యంలో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమయంలోనే ఇక తాము ఎంతో వీరోచితంగా పోరాటం చేస్తున్న రష్యా సైనికులను వందలమందిని మట్టుపెడుతున్నాం అంటూ ఉక్రెయిన్ రక్షణ శాఖ చెబుతూ ఉండడం గమనార్హం.

ఇక ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఉక్రెయిన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నది అర్థమవుతోంది. యుద్ధంలో మరణించిన రష్యన్ సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్ సైనికులు అలాగే వదిలేస్తున్నారు అన్న విషయం ఇటీవల బయటపడింది.

ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నగరంలో యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల మృతదేహాలు మంచుల్లో కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక జర్నలిస్ట్ 'రష్యన్ సైనికుల  డెడీబాడీలను ఇలాగే ఎందుకు వదిలేస్తున్నారని' ప్రశ్నించాడు.  దీనికి వారు 'రష్యన్ సైనికుల డెడ్ బాడీలను కుక్కల కోసం వదిలేశాం' అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

తమ మాతృదేశాన్ని ఆక్రమించేందుకు వచ్చిన రష్యన్లపై సింహాల్లా పోరాటం చేస్తున్నామని.. వారిని తప్పక కాపాడుకుంటాం అంటూ ఉక్రెయిన్ సైనికులు చెబుతున్నారు. రష్యన్ సైనికుల మృతదేహాలకు కుక్కలకు వదిలేశామన్న ఉక్రెయిన్ ప్రకటనతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం చెలరేగింది.
Tags:    

Similar News