రాజకీయ నాయకులకు, సినీ సెలబ్రెటీలకు ఇది బాగా అలవాటైన వ్యవహారమే. నోటికొచ్చినట్లు ఏదో వాగడం.. దాని మీద దుమారం రేగితే.. ‘మీడియా వక్రీకరించింది’ అని, ‘నా మాటల్ని తప్పుగా ప్రెజెంట్ చేశారు.. తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని సింపుల్ గా ఓ మాట అనేసి తప్పించుకోచూడటం కొత్తేమీ కాదు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా గుర్తింపు ఉన్న అమీర్ ఖాన్ కూడా అదే చేశాడు. ‘మత అసహనం’ విషయంలో ఆ మధ్య షాకింగ్ కామెంట్స్ చేసి తీవ్ర విమర్శల పాలైన అమీర్.. ఆ వ్యాఖ్యల మీద క్షమాపణ కూడా చెప్పకుండా, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ మళ్లీ ఓ ప్రకటన కూడా ఇవ్వడం గుర్తుండే ఉంటుంది. ఐతే ఆ తర్వాత తన మీద జనాల్లో వ్యతిరేకత మరింత పెరగడం.. తన బ్రాండ్ వాల్యూ కూడా దారుణంగా పడిపోవడంతో అమీర్ కు కాక బాగానే తగిలినట్లుంది. ఇప్పుడు తన వ్యాఖ్యల మీద తీరిగ్గా పశ్చాత్తాప పడటమే కాదు.. మీడియా మీదికి నెపం నెట్టేసి తప్పించుకోజూస్తున్నాడు.
తన ‘అసహన’ వ్యాఖ్యలపై ఇన్నాళ్లకు ఓ మీడియా సమావేశం పెట్టి మరీ వివరణ ఇచ్చాడు అమీర్. తాను పుట్టింది భారత్ లోనేనని.. చనిపోయేది కూడా భారత్ లోనేనని తేల్చి చెప్పిన అమీర్ ఖాన్.. అసహనం మీద తాను చేసిన వ్యాఖ్యలకు మీడియా తప్పుగా భాష్యం చెప్పిందన్నాడు. తనకు భారతదేశం చాలా ఇష్టమని.. తాను చేసిన వ్యాఖ్యల కారణంగా భావోద్వేగాలు దెబ్బ తిన్న వారి వేదనను అర్థం చేసుకోగలనని చెప్పాడు. తాను విదేశాలకు వెళితే రెండు వారాలకు మించి ఉండలేననంటూ తన దేశ భక్తిని చాటుకునే ప్రయత్నం చేశాడు. తన వ్యాఖ్యలకు తప్పుడు అర్థం రావడానికి మీడియా కూడా కారణమని సెలవిచ్చి ఈ సమావేశానికి తనదైన శైలిలో కంక్లూజన్ ఇచ్చాడు. మీడియా మీద నింద మోపి తప్పించుకోవడానికి మీడియాను భలే వాడుకున్నాడు కదూ అమీర్.