'అధికార పక్షంపై విమర్శలు చేసే ముందు మీ మొహాలను డెటాల్డ్ పెట్టి కడుక్కోండి.. ప్రధాని ఆదేశాల మేరకు రెండు సార్లు ఇంధన ధరలు తగ్గించామని, కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వ్యాట్ పెంచాయని' కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో హిండెన్ బర్గ్ నివేదికపై ప్రతిక్షాల ఆందోళన చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఈ సంస్థ అదానీ కంపెనీ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వివరాలను బయటపెట్టింది.
అయితే ఈ నివేదికపై చర్చ సాగించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. మోదీ మౌనం వీడాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దీనిపై స్పందించారు. ఆ తరువాత నిర్మలా సీతారామన్ కలుగజేసుకొని ప్రతిపక్షాలపై హాట్ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
అదానీ కంపెనీలు రూ.10 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ నివేదిక బయటపెట్టింది. దీనిపై చర్చ జరగాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అదానీ, మోదీ భాయి భాయి అని.. ఈ విషయంపై స్పందించాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వాలు కూలిపోయాయని అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ చేసిన అవినీతి అంతా ఇంతా కాదని విమర్శించారు.
ఆ తరువాత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. బీజేపీ చేసిన అభివృద్ధి కనిపించకపోతే మీ మోహాలను డెటాల్డ్ పెట్టి కడుక్కోండి.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఇంధన ధరలు తగ్గించామన్నారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో వ్యాట్ తగ్గించలేదన్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో డీజిల్ పై మూడు రూపాయల వ్యాట్ పెంచిందన్నారు.
పంజాబ్ లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచిందని, కేరళలోనూ డీజిల్ అమ్మకాలపై సామాజిక భద్రతా సెస్ ను ప్రకటించారని నిర్మల వివరించారు. అధికార పార్టీప విమర్శలు చేసే ముందు అన్ని వివరాలు సరిచూసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని, బీజేపీ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అయితే నిర్మలా సమాధానం ఇచ్చినంత సేపు ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో సభ నినాదాలతో దద్దరిల్లింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.