ప్రముఖ సోషల్ మీడియా చైనా యాప్స్ టిక్ టాక్ - వీచాట్ డౌన్ లోడ్ ల నిషేధంపై అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. వీచాట్ - టిక్ టాక్ ను డౌన్ లోడ్ చేయకుండా నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ జారీ చేసిన ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు వాషింగ్టన్ లోని కోర్టు న్యాయమూర్తి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 11:59 గంటలకు అమలులోకి వస్తుందని తెలిపారు. కోర్టు జారీచేసిన ఈ ఉత్తర్వుల పై టిక్ టాక్ ఆనందం వ్యక్తం చేసింది. యాపిల్ - గూగుల్ సోర్లలో నిషేధం అమల్లోకి రాకుండా నిరోధిస్తూ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జిల్లా జడ్జి కార్ల్ నికోలస్ వెల్లడించారు. అయితే నవంబర్ 12 నుండి అమల్లోకి రానున్న ఇతర వాణిజ్య శాఖ ఆంక్షలను నిరోధించడానికి నికోలస్ నిరాకరించారు
ఇక , మరోవైపు దీనిపై ఒకవైపున చర్చలు జరుపుతున్న నేపథ్యంలో, రాత్రికి రాత్రికి టిక్ టాక్ డౌన్ లోడ్‌లపై ఎలా నిషేధం ఎ విధిస్తారంటూ ఆదివారం నాటి విచారణలో టిక్ టాక్ తరపు న్యాయవాది జాన్ ఈ హాల్ వాదించారు. భద్రత, గోప్యత ఆందోళన నేపథ్యంలో అమెరికా టిక్ టాక్ - వీచాట్ యాప్ లపై ట్రంప్ నిషేధం విధించింది. ఇందులో భాగంగా ట్రంప్ నిర్ణయంపై వాషింగ్టన్ లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేశాయి. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పరిధులు దాటి టిక్ టాక్ ను బ్యాన్ చేశారని ఆరోపించాయి. భద్రత, గోప్యత విషయంలో పౌరుల ప్రయోజనాలను కాపాడుతున్నామన్న , కానీ మా ఆదారాలని పరిగణలోకి తీసుకోకుండా నిషేధం విధించారని కోర్టుకి తెలిపారు. దీనితో కోర్టు ట్రంప్ సర్కార్ కి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చింది.