తెలుగుదేశం పార్టీని వీడుతున్న సంగతి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వారం కిందటే చెప్పినట్టుగా చెప్పుకొచ్చారు టీజీ వెంకటేష్. తెలుగుదేశం పార్టీ ని వీడి బీజేపీలోకి చేరిన టీజీ వారం కిందటే తను ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పినట్టుగా వివరించారు.
వారం కిందట తను చంద్రబాబును కలిసినట్టుగా, అప్పుడే ఈ విషయం గురించి ఆయనకు వివరించినట్టుగా టీజీ చెప్పుకొచ్చారు. తను భారతీయ జనతా పార్టీలోకి చేరే ఉద్దేశాన్ని ఆయనకు తెలియజేసినట్టుగా చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు తనను పార్టీ మారవద్దని కోరారని అయినా తను మారుతున్నట్టుగా టీజీ చెప్పుకొచ్చారు.
రాయలసీమ అభివృద్ధి కోసమే తను బీజేపీలోకి చేరుతున్నట్టుగా ఈయన చెప్పుకొచ్చారు. తనకు భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉందని, విద్యార్థి దశలో తను బీజేపీ తరఫున పని చేసినట్టుగా చెప్పుకొచ్చారు. ఇలా తన ఫిరాయింపును సమర్థించుకునే ప్రయత్నం చేశారీయన.
తనతో పాటు నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేసినట్టుగా, తామంతా ఎంపీలుగా కొనసాగబోతున్నట్టుగా టీజీ ప్రకటించుకున్నారు.