కేసీఆర్ లాంటి సీఎం మాకు కూడా కావాలి.. : ఎవ‌ర‌న్నారో తెలుసా?

Update: 2022-08-27 11:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయా?  కేంద్రంలో చ‌క్రం తిప్పాలని అనుకుంటున్న ఆయ‌న అత్యంత సెంటిమెంటు అంశ‌మైన రైతుల‌ను త‌న‌వైపు తిప్పుకొఏ ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన రైతులు.. "కేసీఆర్ లాంటి సీఎం మాకు కూడా కావాలి" అని వ్యాఖ్యానించ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు.. వారంతా కేసీఆర్‌కు బ్ర‌హ‌ర‌థం కూడా ప‌ట్టారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి పథకాలు, విధానాలను అమలు చేసేలా తమ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తామని పలు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని పరిశీలించేందుకు 25 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్‌ చేరుకున్నారు. కేసీఆర్‌ వంటి ముఖ్యమంత్రి తమకూ ఉంటే బాగుండేదని పర్యటనకు వెళ్లిన ఇతర రాష్ట్రాల రైతులు తెలిపారు.

తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించడం ఆశ్చర్యం అనిపించిందని వారు అన్నారు. కేసీఆర్‌ రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు, రైతుబీమా పథకంలో రూ.5 లక్షల సాయం అందించడం దేశ చరిత్రలోనే గొప్ప పరిణామని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రైతు నాయకుడు హిమాంశ్‌ పేర్కొన్నారు.

కేసీఆర్‌ తెలంగాణకే కాదు, దేశానికే రైతు బాంధవుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, పంజాబ్‌, కర్ణాటక తదితర 25 రాష్ట్రాలకు చెందిన రైతులు దాదాపు 100 మంది పాల్గొన్నారు.

మల్లన్నసాగర్‌ అద్భుతమని జాతీయ రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్‌ను వారు సందర్శించారు. రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు గోదావరి జలాల ఎత్తిపోతల పథకం గురించి వారికి వివరించారు.

అనంతరం సింగాయిపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. రైతు నాయకులు మల్లన్నసాగర్‌ కట్టను పరిశీలిస్తుండగా పంపుల్లో నీళ్లు వదిలారు. ఎనిమిదో పంపు నుంచి ఒక్కసారిగా భారీస్థాయిలో నీరు పైకి చిమ్మడంతో చూస్తున్నవారంతా తడిసిపోయారు.
Tags:    

Similar News