అగ్రరాజ్యం అమెరికాలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులు - కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల నేపథ్యంలో అక్కడి ఎన్నారైలు తీవ్ర భయాందోళనలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇక అమెరికాలో ఇండియన్లు సెటిల్ అయ్యే అవకాశాలు తక్కువేనని కూడా అభిప్రాయం వినిపిస్తోంది. అయితే దీనికి ఫుల్ స్టాఫ్ పెడుతూ కొందరూ భారతీయ ఎన్నారైలు తాము అమెరికాలోనే ఉంటామని తేల్చి చెప్తున్నారు. దేశాధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పినా, సాయుధ దుండగులు బెదిరించినా తాము అమెరికాను వీడేదిలేదని అక్కడి ఇండియన్-అమెరికన్లు తేల్చి చెప్తున్నారు.
అమెరికాలో పెరిగిపోతున్న జాతి - మత వివక్షలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వివిధ భారతీయ సంఘాలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో సౌత్ ఆసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) ఆధ్వర్యంలో వాషింగ్టన్ లో టౌన్ హాల్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సాల్ట్ ప్రతినిధి సుమన్ రఘునాథన్ మాట్లాడుతూ ``తుపాకీ పట్టుకున్న దుండగుడు ఏం చెప్పినా, దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా.. మేం మాత్రం అమెరికాలోనే ఉంటాం. ఇది మా దేశం. వలస వచ్చిన వారికి శ్రేష్ఠమైన దేశమైన అమెరికాలో మాకు హక్కుభుక్తంగా లభించాల్సిన సమాన స్థానం కోసం మేం డిమాండ్ చేస్తూనే ఉంటాం`` అని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇటువంటి సమావేశాలను పెద్ద ఎత్తున ఏర్పాటుచేయాలని దక్షిణాసియా గ్రూపులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. వాషింగ్టన్ టౌన్ హాల్ సమావేశంలో జార్జిటౌన్ యూనివర్సిటీ లా సెంటర్ లో పనిచేసే అర్జున్ సేథీ - ఆశా ఫర్ ఉమెన్ సంస్థ ప్రతినిది డాక్టర్ రేవతి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోని యూదులు - ముస్లింలు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో కూడా అమెరికన్-ఇండియన్లు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/