మోడీని పరామర్శించడానికి వస్తున్నాడా ఆ పెద్ద మనిషి ..!

Update: 2020-02-19 08:56 GMT
అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24-25 తేదీల్లో ఇండియా పర్యటనకి రానున్నారు. దీనికోసం ఇప్పటికే భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లని పూర్తి చేసింది. గుజరాత్ సర్కార్‌ ట్రంప్‌ 3గంటల పర్యటన కోసం అహ్మదాబాద్‌ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. ఆయన రాక సందర్భం గా భారత-అమెరికా దేశాల మధ్య కోట్లాది డాలర్ల విలువైన భారీ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికలు జరిగే లోగా ఈ ప్రక్రియ జరుగుతుందా అన్న విషయం తాను చెప్పలేనని , ఎన్నికల అనంతరమే ఇందుకు అవకాశాలు ఉన్నాయని, కానీ డీల్ తప్పకుండా కుదుర్చుకుంటామని అన్నారు.

మంగళవారం వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఉభయ దేశాల మధ్య గల వాణిజ్య సంబంధాల పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఈ విషయం లో ఇండియా తమను దాదాపు నిర్లక్ష్యం చేస్తోందని అభిప్రాయపడ్డారు. ‘వుయ్ ఆర్ నాట్ ట్రీటెడ్ వెల్ బై ఇండియా’ అని మాట్లాడారు. అయితే , ఇదే సమయంలో భారత్‌ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని , ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.

ఢిల్లీలో మోదీని, ఇతర మంత్రులను కలిసిన అనంతరం తామిద్దరం అహ్మదాబాద్ వెళ్తామని, అక్కడ భారీ స్టేడియంలో ప్రసంగించనున్నామని చెప్పిన ఆయన.. విమానాశ్రయానికి, ఈ స్టేడియానికి మధ్య సుమారు 70 లక్షలమంది ప్రజలు తనను ఆహ్వానం పలుకుతారని మోడీ చెప్పారని వెల్లడించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల నేపథ్యం లో వాణిజ్య ఒప్పందం పై అసలు ఆవిరైయ్యాయి. రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం లేదు. కాగా, ఈ నెల 24న ట్రంప్‌తో పాటు వచ్చే బృందం లో అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్ లైథిజర్ ఉండబోరని ఆ దేశ అధికారి ఒకరు వెల్లడించారు.
Tags:    

Similar News