జపాన్ విహార నౌక డైమండ్ ప్రిన్సెస్ లోని భారతీయుల విడుదల విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ నౌక లో ఉన్న భారతీయులని బయటకి తీసుకురావడం సాధ్యపడదు అంటూ తేల్చేసారు. ప్రస్తుతం చైనా తో సహా 26 దేశాలని వణికిస్తోన్న కరోనా వైరస్ ( కొవిడ్ -19 ) ప్రభావంతో ఆ నౌక ని టోక్యో తీరంలోని యోకహామా వద్ద సముద్రంలోనే జపాన్ ప్రభుత్వం నిలిపివేసింది.
ఈ నౌకలో 3,711 మంది ఉన్నారని, వారిలో 138 మంది భారతీయులు కూడా ఉన్నారు. అలాగే ఈ నౌకలో ఉన్న ఇద్దరు భారతీయులకి ఇప్పటికే కొవిడ్ -19 వైరస్ సోకింది అని ,నౌకలోని భారతీయుల గురించి తమ రాయబార కార్యాలయం జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని మంత్రి జైశంకర్ వారికి నౌకలోనే చికిత్స అందిస్తున్నారని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. అలాగే కొవిడ్-19 వైరస్ నివారణ కు కావాల్సిన అదనపు ఔషధాలను రెండు మూడు నెలల్లో రప్పిస్తామని మంత్రి వివరించారు.
ఇకపోతే ,కోవిడ్-19.. చైనాలో ఇంకా తన ప్రతాపం చూపుతోంది. రోజు రోజుకి ఈ కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. దీనితో మృతులు, బాధితుల సంఖ్య క్రమం గా పెరుగుతోంది. ఒక్క హుబే ప్రావిన్స్ లోనే.. ఒక్కసారిగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగింది. తాజా లెక్కల ప్రకారం ఈ వైరస్ 65 వేల మందికి పైగానే సోకినట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే ఈ వైరస్ కారణం గా ...సుమారుగా 1400 వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ వైరస్ మాత్రం రోజురోజు మరింతగా తన ప్రభావాన్ని చూపిస్తూ విస్తరిస్తోంది.