వదిలేసిన భార్యకు మనోవర్తి ఇవ్వనంటే కుదరట!

Update: 2019-10-01 06:32 GMT
దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆసక్తికర తీర్పును ఇచ్చింది. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మనోవర్తి పేరుతో పరిహారం ఇవ్వనంటే కుదరదని తేల్చి చెప్పింది. తనతో కాపురం చేయటం ఇష్టం లేదన్న కారణాన్ని చూపించి ఆమెకు మనోవర్తి చెల్లింపు నిలిపితే కుదరదని చెప్పింది.

మిగిలిన బంధాల సంగతి ఎలా ఉన్నా.. భార్యతో విడిపోయిన తర్వాత కూడా ఆమెకు పరిహారం ఇచ్చే బాధ్యత భర్తదేనని స్పష్టం చేసింది. తనతో కాపురం చేయటం ఇష్టం లేక విడిచిపెట్టి వెళ్లిపోయిన భార్యకు విడాకులు ఇచ్చినా.. పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుందని తాజా కేసులో సుప్రీం తేల్చి చెప్పింది.

వివాహ బంధం తెగి పోయిన తర్వాత మాజీ భర్తతో కలిసి జీవించాల్సిన అవసరం లేదని చెప్పిన కోర్టు.. ఆ కారణాన్ని చూపించి ఆమెకు ఇవ్వాల్సిన మనోవర్తిని చెల్లించకుండా తప్పించుకోవటం సాధ్యం కాదని చెప్పింది. మొత్తంగా భార్యతో బంధాన్ని తెగతెంపులు చేసుకున్నప్పటికి మనోవర్తి బాధ్యత భర్తదేనని సుప్రీంకోర్టు తన తీర్పుతో వెల్లడించింది.
Tags:    

Similar News