చైనాలో పుట్టిన కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంది. అలాగే సుమారు 80వేల మందికి పైగా ఈ కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. మొత్తంగా ఈ కరోనా వైరస్ ప్రపంచం పై ప్రభావం చూపుతోంది. కరోనాతో ఇప్పటికే చాలా రకాల బిజినెస్ లు కుదేలైపోయాయి . ఇప్పుడు దీని ఎఫెక్ట్ పౌల్ట్రీ రంగంపైనా తీవ్రమైన ప్రభావం చూపింది. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనే ప్రచారంతో వాటిని తినే వారు తగ్గిపోయారు. చికెన్ అంటేనే జనాలు పరుగులు పెడుతున్నారు. ఒకప్పుడు 200 పైగా రేటు పలికిన చికెన్ , కరోనా దెబ్బకి ఒక్కసారిగా 100 కి దిగువకు వచ్చింది.
అయితే, చికెన్, గుడ్లు తింటే కరోనా రాదు అని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ చెబుతోంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో చికెన్, ఎగ్ మేళా నిర్వహించింది నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ. దీనికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, సినీ నటి రష్మిక హాజరయ్యారు. చికెన్, గుడ్డు తింటే కరోనా రాదని మంత్రుల స్పష్టం చేశారు. చికెన్, గుడ్డు వినియోగం విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చికెన్ మంచి పోషకాహారమని, దీనికి కరోనాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చికెన్ ఆరోగ్యానికి ఎంతో మంచిందని, సోషల్ మీడియా పుకార్లను నమ్మ వద్దని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర తెలంగాణ మంత్రులు కూడా చికెన్ లెగ్ పీస్ లు తిన్నారు. ఈ ఈవెంట్ కి చికెన్ ప్రియులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.