విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకుంటున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరిగిపోతోంది. విదేశాల్లో డాక్టర్ చదువంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది చైనా దేశమే. తర్వాత స్థానం ఉక్రెయిన్ కు దక్కుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల్లో ఎంబీబీఎస్ చదుకునేందుకు ఎక్కువగా వెళుతున్నారు. పోయిన ఏడాది జనవరి 1వ తేదీనుండి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన విదేశాల్లో డాక్టర్ చదువు పూర్తి చేసిన వారు 644 మందున్నారు.
విదేశాల్లో ఎక్కడ ఎంబీబీఎస్ చదివినా మనదేశంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినంత మాత్రాన దేశానికి వచ్చేసి వెంటనే ప్రాక్టీసు పెట్టేందుకు లేదు. మళ్ళీ మన దగ్గర ఒక టెస్టు పాసవ్వాల్సిందే. ప్రతి ఏడాది విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి తిరిగి ఇండియాకు వచ్చిన విద్యార్థుల కోసం మెడికల్ కౌన్సిల్ ఒక స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తుంది. ఇందులో పాసైనవారు మాత్రమే మనదేశంలో ప్రాక్టీసుకు అర్హలవుతారు.
విదేశాలకు వెళ్ళి చదువుకునే వారిలో అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇపుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న 644 మందిలో 164 మంది చైనాలో చదివిన అమ్మాయిలే ఉన్నారు. అలాగే ఉక్రెయిన్లో చదివిన అమ్మాయిల సంఖ్య 126. పై రెండు దేశాల తర్వాత కిర్గిస్థాన్, ఫిలిప్పీన్స్ లో చదవటానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మొత్తం మీద మన దేశం నుండి 18 దేశాలకు ఎంబీబీఎస్ చదువుకునేందుకు వెళుతున్నట్లు తేలింది.
మనదేశంలో ఎంబీబీఎస్ చదవాలంటే డిమాండును బట్టి తక్కువలో తక్కువ కోటి రూపాయల ఖర్చవుతుంది. అదే విదేశాల్లో అంటే చైనా, ఉక్రెయిన్లో అయితే ఆరేళ్ళ కోర్సుకు అయ్యే ఖర్చు సుమారు 35 లక్షల రూపాయలు మాత్రమే. ఎడ్యుకేషన్ లోన్లు ఇవ్వటానికి బ్యాంకులు ముందుకొస్తుండటంతో మద్య తరగతి విద్యార్థులు కూడా డాక్టర్ కోర్సు పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కెనాడా, సెంట్రల్ అమెరికా, నేపాల్, జార్జియా, సెయింట్ లూయిస్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ దేశాల్లో కూడా మన వాళ్ళు ఎంబీబీఎస్ చదివేస్తున్నారు.