మహారాష్ట్ర రాజకీయం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మహారాష్ట్రలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో బీజేపీ - శివసేన ఒక కూటమిగా , కాంగ్రెస్ -ఎన్సీపీ కలిసి పోటీ చేసాయి. కానీ , ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ మాత్రం దక్కలేదు. దీనితో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అసలు రాజకీయం బయటపడింది. ఈ ఎన్నికలలో బీజేపీ సింగల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించింది. అలాగే శివసేన నిజమైన కింగ్ మేకర్ గా అవతరించింది.
288 స్థానాలకు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 161 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు గెలిచింది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ , ఎన్సీపీ , ఇతరులు గెలుపొందారు. దీనితో అందరూ బీజేపీ -శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని అనుకున్నారు. కానీ , అక్కడే అసలు వివాదం మొదలైంది. ఎన్నికల ముందు చెప్పినట్టు 50 -50 పార్ములా కింద ముఖ్యమంత్రి పదవి చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందే అని పట్టుబడుతోంది. బీజేపీ మాత్రం దానికి ససేమిరా అనడం తో ఇద్దరి మధ్య కుమ్ములాటలు మొదలైయ్యాయి. ఈ విషయంలో ఎవరూ పట్టు విడవకపోవడంతో మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటుకి ఇంకా కొంత సమయం పెట్టె అవకాశం కనిపిస్తుంది.
ఈ సమయంలో బీజేపీ , శివసేన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో తమకు ప్రత్యామ్నాయ మార్గం ఉందని శివసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే శివసేన బీజేపీ తో పొత్తు కుదరకపోతే ...కాంగ్రెస్ , ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పరోక్షంగా చెప్పారు. కానీ , ఎప్పుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ .. మేము తాము అధికార కూటమిలో భాగస్వామ్యులం కావాలని అనుకోవడం లేదు , మాకు ప్రజలు ప్రతిపక్షం ఇచ్చారు ..అక్కడే కూర్చుంటాం అని ప్రకటించారు.
ఒక సమయంలో కాంగ్రెస్ వాళ్లు కూడా శివసేన తో సై అన్నట్టుగా మాట్లాడారు. ఎన్సీపీ అధినేత మాత్రం తమది ప్రతిపక్షవాసమే అని ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తమపై వచ్చే ఆరోపణల నేపథ్యంలో తెరదించే ప్రయత్నం చేశారు. సోనియాగాంధీతో సమావేశం అనంతరం మాట్లాడుతూ.. తమ కూటమి ప్రతిపక్షంలోనే ఉంటుందని ఆయన ప్రకటించారు. మరో విషయం తో శివసేన తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అసలు ఇష్ట పడటం లేదు అని కొందరు కీలక నేతలు చెప్తున్నారు. దీనితో శివసేనకు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది అని చెప్పవచ్చు. దీనితో ఇప్పుడు శివసేనకు బీజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది.