దిగజారుతున్న సంపన్న రాష్ట్రం ఆర్థిక పరిస్థితి?

Update: 2023-03-03 12:51 GMT
దేశంలోనే సంపన్న రాష్ట్రం అంటూ ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు అప్పుల కోసం తిప్పలు పడుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులు, పథకాలకు చేసిన అప్పులకు కిస్తీలు కట్టేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. దీనికి మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ప్రచారం సాగుతోంది.

తాజాగా తెలంగాణ అధికార వర్గాల నుంచి లీక్ అవుతున్న సమాచారం మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చెల్లించాల్సిన సుమారు రూ.5వేల కోట్ల వరకూ కిస్తీలకు డబ్బులు లేకపోవడంతో  ఆర్.బీఐ నుంచి అప్పు చేసి సర్దుబాటు చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.

కిస్తీలు సక్రమంగా చెల్లించకపోతే ఓపెన్ మార్కెట్ లో పరపతి పడిపోతుందనే టెన్షన్ కూడా సర్కారులో నెలకొందట.. దీనికి తోడు ఈనెల ఉద్యోగుల జీతాలు చెల్లింపు కూడా మరింతగా ఆలస్యం అవుతుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. రైతుబంధు స్కీం కూడా చెల్లింపులు పెండింగ్ లో పెట్టినట్టుగా సమాచారం.

ప్రస్తుతం చెల్లించాల్సిన ఈఎంఐల కోసమే తెలంగాణ సర్కార్ వద్ద డబ్బులు కరువు అయ్యాయని.. వీటి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. వడ్డీలు, రీపేమెంట్ లకు తిప్పలు పడుతున్నారని సమాచారం.

తెలంగాణలో కరోనా తర్వాత సర్కార్ కు ఆదాయం బాగా పడిపోయిందట.. అనుకున్నంత రాబడి రావడం లేదట.. దీంతో ఇతర చెల్లింపులను వాయిదా వేసి కిస్తీలు మాత్రమే చెల్లించడంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. 2022-23 ఫైనాన్స్ ఇయర్ లో ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో రాబడి రాలేదు. దీంతో గతంలో చేసిన అప్పులకు కిస్తీలు చెల్లించడం సవాలుగా మారిందని ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే ఈ ఫిబ్రవరి చివరి వారంలో బాండ్లను విక్రయించి రూ.1000 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకున్నది. ఈనెల 2న మరో 1000 కోట్లు కావాలని దరఖాస్తు చేసుకుంది.రూ.2వేల కోట్లు కేవలం కిస్తీలకే చెల్లింపుల కోసమేనని.. జీతాలకు మరింతగా అప్పు చేయాలని అంటున్నారు.    



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News