మేళతాళాలు.. వేదపండితుడి మంత్రోచ్ఛరణలు.. బంధుమిత్రుల కోలాహలం.. నడుమ పెళ్లి అంగరంగ వైభవంగా సాగుతోంది. మరికొద్ది సేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు. అంతలోనే వరుడి ఫోన్ కు కొన్ని ఫొటోలు వచ్చాయి. అవి ఓపెన్ చేసి చూస్తే వధువు మరో యువకుడితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలవి.. ఆ వెంటనే వరుడికి ఫోన్ వచ్చింది. ‘నువ్వు చేసుకోబోయే వధువుకు తాను ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నామని.. ఆమెను వదిలేయాలని ’’ సూచించాడు. దీంతో వరుడు పెళ్లికి నిరాకరించాడు. తనన మోసం చేశారంటూ వధువు - ఆమె కుటంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు..
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతికి.. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ లోని కనకదుర్గ కాలనీకి చెందిన యువకుడు ఆడెపు అనిల్ కుమార్ తో వివాహం నిశ్చమైంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని బీఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కట్టబోతుండగా ఈ నిజం వరుడికి తెలియడంతో పెళ్లి ఆగిపోయింది..
వధువు హైదరాబాద్ లోని ఓ సూపర్ మార్కెట్ లో మూడేళ్లుగా పనిచేస్తోంది. అక్కడే ఈమెతో పాటు క్యాషియర్ గా పనిచేస్తున్న మల్లబోయిన ప్రశాంత్ అనే యువకుడు కూడా చేస్తున్నాడు. వీరిద్దరికి పరిచయం ఉండడంతో చాలాసార్లు సెల్ఫీలు దిగారు. ఆ ఫొటోలనే వరుడికి పంపిన ప్రశాంత్ పెళ్లి ఆగిపోయేలా చేశాడు.
ప్రశాంత్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని.. షాప్ లో దిగిన సెల్ఫీ ఫొటోలు చూపించి పెళ్లి ఆగిపోయేలా చేశాడని వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రశాంత్ పై చర్య తీసుకోవాలని కోరింది. ఇలా ఓ సెల్ఫీ ఏకంగా పెళ్లినే ఆగిపోయేలా చేసింది. పాత సినిమాల్లో తాళికట్టేముందర పెళ్లి ఆగిపోయే సీన్లు చాలా చూశాం. అలాంటి లైవ్ సీన్ ఫంక్షన్ హాల్ లో చూసేసరికి అంతా అవాక్కయ్యారు.