ప్రభుత్వ ఉద్యోగులంతా వారాంతపు సెలవులంటూ సేద తీరుంటే.. పోలీసుల తీరు మాత్రం అందుకు భిన్నం. ఆ రోజు.. ఈ రోజు అన్న తేడా లేకుండా వీక్లీఆఫ్ అన్నది లేకుండా పని చేస్తున్న వైనానికి సెలవు చీటి పడనుంది. ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా కరీంనగర్ జిల్లా పోలీసులకు వీక్లీఆఫ్ సౌకర్యాన్ని కల్పిస్తూ జిల్లా పోలీస్ బాస్ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి అధికారి వరకూ వారాంతపు సెలవు తీసుకునే వెసులుబాటును తాజాగా కల్పించారు.
ఈ విధానాన్ని తాజాగా షురూ చేశారు. దీంతో ఏళ్ల తరబడి వీక్లీఆఫ్ డిమాండ్ కల సాకారం కానుండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారి అమలు చేస్తున్న ఈ విధానానికి సాయంగా ఉండేందుకు ఒక సాఫ్ట్ వేర్ ను రూపొందించటం విశేషం. తాజాగా తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్ జిల్లాలోని నాలుగు వేల మంది పోలీసులకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం విధివిధానాల్ని రూపొందించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలోని పోలీసులకు రోజుకు ఒకరు చొప్పున వీక్లీఆఫ్ ను వినియోగించే వీలు కల్పించారు. అదే సమయంలో.. ఎవరైనా సెలవులో వెళితే.. వారు వచ్చిన తర్వాత మిగిలిన వారు వారి వీక్లీఆఫ్ ను వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. కరీంనగర్ పోలీస్ బాస్ అమలు చేస్తున్న నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. తెలంగాణరాష్ట్రం మొత్తం ఈ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందన్న భావన పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి.. కరీంనగర్ ఎస్పీ విధానాల్ని స్ఫూర్తిగా తీసుకునే జిల్లా ఏమిటన్నది కాలమే సమాధానం చెప్పాలి.